‘బిగ్ బాస్-1’ కోసం వీకెండ్ వస్తే చాలు… ఎన్టీఆర్ లోనోవాలా వెళ్ళేవాడు. మహారాష్ట్రలోని పూణే సమీపంలో గల లోనోవాలా హిల్ స్టేషన్లో ‘బిగ్ బాస్’ హౌస్ సెట్ వుండేది. అందువల్ల, షో హోస్ట్ చేసినన్ని రోజులూ శుక్రవారం ఉదయం బయల్దేరి లోనోవాలా వెళ్ళేవాడు. శనివారం, ఆదివారం షోలో కనిపించేవాడు. అంటే.. శనివారం టెలికాస్ట్ అయ్యే షో శుక్రవారం షూటింగ్ చేసేవారు. ఆదివారం టెలికాస్ట్ అయ్యే షో శనివారం షూటింగ్ చేసేవారు. సో… ఆదివారం మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చేవారు. ‘బిగ్ బాస్-2’ హోస్ట్ చేయనున్న నాని లోనోవాలా ట్రావెల్ చేయవలసిన అవసరం లేదు. ‘బిగ్ బాస్-2’ సెట్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో వేశారు. అందువల్ల.. నాని తీరిగ్గా శుక్రవారం సాయంత్రం సెట్ కి వెళితే చాలు. దాంతో అతనికి బోల్డంత టైమ్ సేవ్ అవుతుంది. నాని కూడా ఇదే విషయం చెప్పాడు. “షూటింగ్ పూర్తయిన వెంటనే ఇంటికి వెళ్లి జున్నుగాడితో (నాని కుమారుడు) ఆడుకోవచ్చు. సైట్ హైదరాబాద్ లో వుండటం వల్ల టైమ్ కలిసొస్తుంది” అని నాని అన్నాడు.