‘నిన్ను కోరి’తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు శివ నిర్వాణ. మజిలీ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు మరో సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నాడు. నాని కోసం శివ ఓ కథ సిద్ధం చేశాడు. దానికి నాని కూడా ఓకే అనేశాడు. అన్నట్టు.. ఈ సినిమాలో ఆది ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. `నిన్ను కోరి`లోనూ ఆది కనిపించాడు. తన పాత్రకు ఆ సినిమాలో చాలా ప్రాధాన్యం ఉంది. ఓ రకంగా శివ నిర్వాణ మల్టీస్టారర్ కథ రాసుకున్నాడు. రెండో హీరో పాత్రకు ఆది అయితే బాగుంటుందని ఫిక్సయ్యాడు. ఆది కూడా మరోసారి శివ నిర్వాణతో కలసి పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. కథా చర్చలు పూర్తయ్యాయి. త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం `వి` సినిమాతో బిజీగా ఉన్నాడు నాని. అది కూడా మల్టీస్టారరే!