హీరోగా ఎంత వెరైటీ కథలు ఎంచుకుంటాడో, నిర్మాతగానూ అంతే కొత్త తరహా కథలతో తన అభిరుచిని చాటుకుంటున్నాడు నాని. అ, హిట్.. అలాంటి చిత్రాలే. ఇప్పుడు తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై కొత్త సినిమా మొదలెట్టాడు. అదే `మీట్ క్యూట్`. సోమవారమే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లింది. ఇందులో ఎవరెవరు ఉన్నారన్నది నాని చెప్పలేదు గానీ, లేడీ క్యారెక్టర్ల డామినేషన్ మాత్రం ఉంటుందని చెప్పేశాడు. ఇందులో ఏకంగా అయిదుగురు హీరోయిన్లుంటారని టాక్. ఆ ఐదుగురులో ముగ్గురు పేరున్న వాళ్లూ, ఇద్దరు కొత్తవాళ్లూ ఉంటారని తెలుస్తోంది. `అ`లో కూడా.. కథానాయికల డామినేషన్ ఉంటుంది. కాకపోతే.. అది మరో తరహా కథ. `మీట్ క్యూట్`లోని ఒకొక్కరి పేరూ.. ఒక్కోసారి ప్రకటించి, విభిన్నంగా పబ్లిసిటీ చేసుకుందామన్నది నాని ప్లాన్. అన్నట్టు ఈ సినిమాని హ్యాండిల్ చేస్తోంది కూడా లేడీ డైరెక్టరే. దీప్తీ గంటా.. తొలిసారి మెగాఫోన్ పట్టబోతోంది.