నానిని పూర్తిగా మాస్ అవతార్‌లో చూపించిన చిత్రం ‘దసరా’. నాని గెటప్, ఫ్రెండ్షిప్, ఎమోషన్స్, యాక్షన్.. అన్నీ బాగా పండాయి. పాటలూ హిట్టయ్యాయి. నానితో పాటుగా కీర్తి సురేష్‌కీ మంచి పేరొచ్చింది. ‘దసరా’తో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే తన మార్క్ చూపించుకొన్నాడు. ‘దసరా’ తరవాత శ్రీకాంత్ నుంచి కొత్త సినిమా కబురేం రాలేదు. అయితే… నానితోనే మరో సినిమా ఫిక్స్ చేసుకొన్నాడని టాక్. ‘దసరా’తో హిట్ ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ గా… నాని శ్రీకాంత్ కి మరో ఛాన్స్ ఇచ్చాడు. ‘దసరా’ని తెరకెక్కించిన చెరుకూరి సుధాకర్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండడం విశేషం. కథ ఆల్రెడీ ఓకే అయిపోయింది. దానికి ఇప్పుడు తుది మెరుగులు దిద్దుతున్నారు. నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’తో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ – నాని కాంబినేషన్లో ఓ సినిమా ఫిక్సయినట్టు సమాచారం అందుతోంది. దానిపై ఇంకా క్లారిటీ రావాల్సివుంది. ‘సరిపోదా శనివారం’ తరవాత త్రివిక్రమ్ సినిమా మొదలవుతుంది. అదేమైనా ఆలస్యం అయితే.. శ్రీకాంత్ సినిమా మొదలెట్టేస్తారు.