నాచురల్ స్టార్ నాని లక్ పీక్ స్టేజ్ లో ఉంది అంటే నమ్మాలేమో.. మొన్నటిదాకా ఎలాంటి సినిమా చేయాలి.. ప్రయోగాలంటూ తీసిన పైసా, జెండాపై కపిరాజు ఫ్లాపులు అయ్యాయే అనే ఆలోచనలో ఉన్న నాని.. చివరకు ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ.. ఇలా హ్యాట్రిక్ హిట్స్ తో వారెవా అనిపించేస్తున్నాడు.
రీసెంట్ కృష్ణగాడి హిట్ తో మంచి జోష్ లో ఉన్న నాని ఇదే ఫాంతో తను తర్వాత నటిస్తున్న ఇంద్రగంటి సినిమా షూట్ లో పాల్గొంటున్నాడు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం నాని మోహనకృష్ణ సినిమాలో డ్యుయల్ రోల్ చేస్తున్నాడట. అంతేకాదు ఈ సినిమాకు ‘ధమాకా’ అనే టైటిల్ కూడా పెట్టబోతున్నారని టాక్. అష్టా చచమ్మాతో తనకు మొదటి హిట్ ఇచ్చిన ఈ దర్శకుడితో చేస్తున్న నాని ఈ సినిమాకు కూడా తన హిట్ మేనియా కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు.
ఇప్పటికే జెండాపై కపిరాజు సినిమాలో డ్యుయల్ రోల్ చేసిన నాని మరోసారి ద్విపాత్రాభినయంలో అలరించనున్నాడు. నాని సినిమా తీస్తే హిట్ అన్నట్టు ఉన్న ఈ పరిస్థితి ఇలానే మరిన్ని హిట్స్ కొట్టి స్టార్ రేంజ్ కు వెళ్లాలని కోరుకుంటున్నారు అభిమానులు.