గతంలో అ అనే సినిమాలో నిర్మాణ భాగస్వామిగా వున్నాడు హీరో నాని. మళ్లీ ఆ తరువాత సినిమా నిర్మాణ ఆలోచనలు చేయలేదు. అయితే ఇటీవల 96 సినిమా రీమేక్ లో భాగస్వామి అవుతాడు నాని అంటూ వినిపించింది. కానీ అదీ కాలేదు.
అయితే లేటెస్ట్ గా రెండు ప్రాజెక్టుల పై నాని దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. హారిక హాసిని సిస్టర్ కన్సెర్న్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి ఓ ప్రాజెక్టు, దిల్ రాజు తో కలిసి ఓ ప్రాజెక్టు చేసే ఆలోచనలో వున్నట్లు వినిపిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టుల్లోనూ నానినే హీరోగా వుంటాడు.
అయితే ఇవి ఇప్పటికిప్పుడు మెటీరియలైజ్ అయ్యేవి కాదు. దిల్ రాజుతో ప్రాజెక్టు ఈ ఏడాది వుండొచ్చు. సితార ప్రాజెక్టు మాత్రం వచ్చే ఏడాదినే వుండొచ్చు. మొత్తం మీద ఆ మధ్య ఒకటి రెండు పరాజయాలు పలకరించినా, నాని బాగానే సర్దుకుని, చకచకా సినిమాలు చేస్తున్నాడు.