హీరో నాని మళ్లీ మరోసారి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. గతంలో ఆయన అ ! అనే డిఫరెంట్ సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆయన వాల్ పోస్టర్ సినిమా కంపెనీ అని ఒక సంస్థ కూడా స్టార్ట్ చేసారు. ప్రశాంతి తిపుర్నేని భాగస్వామి. ఇప్పుడు మళ్లీ ఇదే బ్యానర్ మీద సినిమా చేసే ప్లాన్ లో వున్నారని తెలుస్తోంది.
ఓ కొత్త దర్శకుడు తెచ్చిన స్క్రిప్ట్ నానికి అధ్భుతంగా నచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ స్క్రిప్ట్ హీరో రానా దగ్గుబాటికి అయితే సూపర్ గా సెట్ అవుతుందని భావిస్తున్నాడట నాని. అయితే రానా ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు ఫైనల్ చేసే పనిలో వున్నాడు. అందులో సాయిపల్లవి-రానా ప్రాజెక్టు కూడా వుంది.
వీటిల్లో ఏదయినా పక్కన పెట్టి, తన ప్రాజెక్టు చేయగలడా అనే ఆలోచనలో నాని వున్నట్లు తెలుస్తోంది. రానా సై అంటే నాని మళ్లీ నిర్మాత అవతారంలో కనిపిస్తాడు అన్నమాట.