‘‘ఈ రోజు (ఆదివారం) ఫినాలే (బిగ్‌బాస్–2 ఫైనల్స్). ‘బిగ్‌బాస్–2’ హోస్ట్‌గా నాకు చివరి రోజు. నేను నా బెస్ట్ ఇచ్చాను. ఇది ఒక అద్భుత ప్రయాణం. ఈ ప్రయాణంలో చాలా నేర్చుకున్నారు. నాకు తెలిసిన చాలా విషయాలను పక్కన పెట్టేశా. షోతో పాటు నా యాంకరింగ్‌ని ఇష్టపడినవాళ్ళకు థ్యాంక్యూ సోమచ్.
ఇష్టపడనివాళ్ళకు చెప్పేది ఒక్కటే… థియేటర్లలో కలుద్దాం.
బిగ్‌బాస్‌కి ఇంక సెలవు
ఈ రోజు సాయంత్రం చూస్తారుగా..’’
–– మీ నాని
ఇదీ నేచురల్ స్టార్ నాని ‘బిగ్‌బాస్–2’ ఫైనల్ ఎపిసోడ్ ప్రారంభానికి ముందు ట్విట్టర్లో చేసిన పోస్ట్! దీని అర్థం ఏంటి? మళ్ళీ ‘బిగ్‌బాస్’ షో హోస్ట్ చేయనని చెప్పినట్టేనా?!! ప్రేక్షకుల్లో పలు సందేహాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే… ‘బిగ్‌బాస్’ హోస్ట్‌గా నాని తీరుపై కౌశల్ ఆర్మీ సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేసింది. హోస్ట్‌గా మొదట్లో అంతగా ఆకట్టుకోకున్నా… తరవాత తరవాత ఎంతో మెరుగయ్యాడు. అయినా నానిపై విమర్శలు తప్పలేదు. అందువల్ల, అతడు మరోసారి హోస్ట్‌గా చేయకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
‘బిగ్‌బాస్’ ఫస్ట్ సీజన్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించాడు. తనదైన శైలిలో షోను జనరంజకంగా మలిచాడు. సీజన్ 2కి నాని వచ్చాడు. నేచురల్ స్టార్ కూడా బాగా చేశాడు. కాని చాలామంది ఎన్టీఆర్‌తో ఇతణ్ణి పోల్చడం, టీఆర్పీ రేటింగులకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి నాని ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే విధంగా మారాయి. నిజానికి, రెండు సీజన్స్‌ని గమనిస్తే… మొదటి సీజన్లో సెలబ్రిటీలకు, రెండో సీజన్లో సెలబ్రిటీలకు అసలు సంబంధమే లేదు. సీజన్1లో అర్చన, ముమైత్‌ఖాన్, సంపూర్ణేష్‌బాబు, ప్రిన్స్, శివబాలాజీ, ఆదర్శ్, హరితేజ, ధనరాజ్ వంటివాళ్ళు ఉన్నారు. సెకండ్ సీజన్‌కి వచ్చేసరికి అటువంటి సెలబ్రిటీలు ఎక్కువమంది లేరు. వాటిని ఎవరూ పరిగణలోకి తీసుకోకుండా నాని యాంకరింగ్‌ని వేలేత్తి చూపించారు. మొత్తానికి ఈ రోజుతో బిగ్‌బాస్2 ముగుస్తుంది. మళ్ళీ మూడో సీజన్‌కి ఎవరు హోస్ట్‌గా వస్తారో?
#BiggBossTelugu2 pic.twitter.com/kDALbnq8cI
— Nani (@NameisNani) September 30, 2018