ఈమధ్య వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టిన కుర్ర డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే.. అది అనిల్ రావిపూడినే అని చెప్పొచ్చు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్లతో హ్యాట్రిక్ అందుకున్నాడు. ఇప్పుడు వెంకటేష్ – వరుణ్‌తేజ్‌లతో ఓ మల్టీస్టారర్ చేస్తున్నాడు. అది సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో హీరోకి కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు అనిల్. ఈసారి నానితో జట్టు కట్టబోతున్నాడు. నాని – అనిల్‌ల కాంబో దాదాపుగా ఖాయమైపోయినట్టే. కాకపోతే… నాని వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. తన చేతిలో ప్రస్తుతం `జెర్సీ` ఉంది. ఆ తరవాత… విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి. ఇవి రెండూ పూర్తయితే గానీ.. అనిల్ రావిపూడి సినిమాని పట్టాలెక్కించడలేడు. మరి అనిల్ అప్పటి వరకూ ఆగుతాడా? లేదంటే మరో ప్రాజెక్టు సెట్ చేసుకుని, ఆ తరవాత నాని దగ్గరకు వస్తాడా? అనేది తేలాల్సివుంది.