ఓ బేబీతో ఓ సూపర్ హిట్ అందుకుంది నందినిరెడ్డి. ఇప్పుడు స్వప్న సినిమాస్ బ్యానర్లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతోంది. కథ కూడా ఓకే అయిపోయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరగుతోంది. ఈ కథ నాని కోసం రెడీ అవుతున్నట్టు టాక్. నాని – నందిని రెడ్డి కాంబినేషన్లో ‘అలా మొదలైంది’ వచ్చింది. దర్శకురాలిగా నందినికి అదే తొలి సినిమా. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాదు, చాలా చిన్న సినిమాలకు బాసటగా నిలిచింది. ఆ తరవాత… నాని – నందిని మరో సినిమా చేద్దామనుకున్నారు. కానీ.. ఇప్పటి వరకూ కుదర్లేదు. ‘ఓ బేబీ’ హిట్టుతో నందినితో సినిమా చేయడానికి నాని కూడా ఉత్సాహం చూపిస్తున్నట్టు టాక్. నందిని రెడ్డితో ఓసినిమా ఉంటుందని ప్రియాంక దత్, స్వప్న దత్ ప్రకటించారు. కానీ హీరో ఎవరో చెప్పలేదు. ఆ హీరో నానినే అని టాక్ నడుస్తోంది.