యంగ్ హీరో నాని చేతిలో మూడు సిన్మాలున్నాయ్! మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ద్విపాత్రాభినయం చేస్తున్న ‘కృష్ణార్జున యుద్ధం’ షూటింగ్ ఆల్మోస్ట్ చివరికి వచ్చింది. ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’ సిన్మాల ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి నటించనున్న మల్టీస్టారర్ షూటింగ్ త్వరలో మొదలవుతుంది. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ సిన్మాల ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. ఇంకొన్ని చర్చల దశలో ఉన్నాయి. వీటిని పక్కన పెడితే… రీసెంట్గా ‘ఛలో’తో సక్సెస్ కొట్టిన వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో యువహీరో శర్వానంద్‌తో కలిసి ఒక మల్టీస్టారర్, ‘ఫిదా’తో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన శేఖర్ కమ్ములతో ఒక సినిమా చేసే ఛాన్సులు ఉన్నాయని వార్తలు వచ్చాయి. వీటిని నాని ఖండించారు. రెండూ ఫేక్ న్యూస్ అని ట్విట్టర్లో పేర్కొన్నారు.