నాని లైన‌ప్ మామూలుగా లేదు

‘స‌రిపోదా శ‌నివారం’తో మ‌రో డీసెంట్ హిట్ త‌న ఖాతాలో వేసుకొన్నాడు నాని. గురువారం విడుద‌లైన ‘గోట్‌’ తేడా కొట్ట‌డం ఈ సినిమాకు బాగా క‌లిసొచ్చింది. వినాయ‌క చ‌వితి సెల‌వ‌ల్ని కూడా ‘స‌రిపోదా..’ క్యాష్ చేసుకొంటోంది. మెల్ల‌మెల్ల‌గా ‘స‌రిపోదా…’ బ్రేక్ ఈవెన్ దిశ‌గా ప‌రుగులు పెడుతోంది. ఏపీ, తెలంగాణ‌ల‌లో భారీ వ‌ర్షాలు ఉప్ప‌టికీ ఈ స్థాయి వ‌సూళ్లు అందుకోవ‌డం గొప్పే అనుకోవాలి.

నాని తదుప‌రి సినిమాల లైన‌ప్ కూడా మామూలుగా లేదు. ‘స‌రిపోదా.. శ‌నివారం’ విడుద‌లైన వెంట‌నే ‘హిట్ 3’ ప్ర‌క‌టించేశాడు. `హిట్` అనేది హిట్ ఫ్రాంచైజీ. కాబ‌ట్టి త‌ప్పు జ‌రిగే అవ‌కాశం లేదు. ఈ సినిమాకు నిర్మాత కూడా నానినే. విడుద‌ల‌కు ముందే ఇది ప్రాఫిట్ వెంచ‌ర్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. మ‌రోవైపు ద‌స‌రా ద‌ర్శ‌కుడు క‌థ‌తో రెడీగా ఉన్నాడు. నిజానికి ‘హిట్ 3’ కంటే ముందే శ్రీ‌కాంత్ ఓదెల సినిమా ప‌ట్టాలెక్కాలి. కానీ… నాని మ‌న‌సు మార్చుకొని, ‘హిట్ 3’ని లైన‌ప్ చేశాడు. 2025 సంక్రాంతికి శ్రీ‌కాంత్ ఓదెల సినిమా మొద‌ల‌వుతుంది. ఆ త‌ర‌వాత సుజిత్ తో నాని ఓ సినిమా చేస్తాడు. నాని – సుజిత్ అంటే క్రేజీ కాంబోనే. పైగా ‘ఓజీ’ త‌ర‌వాత చేసే సినిమా కాబ‌ట్టి అంచ‌నాలు ఓ రేంజ్ లో ఉంటాయి. ‘జెర్సీ’ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి కూడా నాని కోసం ఓ క‌థ రెడీ చేశాడు. శేఖ‌ర్ క‌మ్ముల – నాని కాంబోలో ఓ చిత్రం సెట్స్‌పైకి వెళ్ల‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇవ‌న్నీ పూర్త‌య్యే స‌రికి క‌నీసం 2 ఏళ్ల‌యినా ప‌డుతుంది. మ‌రోవైపు నిర్మాత‌గానూ నాని బిజీనే. ఇటీవ‌లే ప్రియ‌ద‌ర్శితో ‘కోర్ట్’ అనే చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. త్వ‌ర‌లోనే నాని బ్యాన‌ర్‌లో మ‌రో సినిమాకు సంబంధించిన ప్ర‌క‌ట‌న రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close