నాని కెరీర్ లో తొలి మాస్ సినిమా దసరా. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓడెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని ఊరమాస్ గెటప్ లో కనిపిస్తున్నాడు. తాజాగా విడుదలైన టీజర్ కు నాని ఫ్యాన్స్ ని కూడా ఆశ్చర్యపరిచింది. లుంగీ కట్టుకొని మాసిపోయిన గెడ్డంతో బొగ్గు గనుల్లో మునిగితేలినట్లుగా చాలా కొత్తగా వుంది నాని ఎప్పిరియన్స్. విజువల్స్, నేపధ్య సంగీతం, నానీ మ్యానరిజం, డైలాగ్ డెలివరీ అన్నీ కొత్తగా వున్నాయి. పాన్ ఇండియా సినిమాగా దసరా ని విడుదల చేస్తున్నారు.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో నాని మాటలు దసరా పై అతనికి వున్న నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి. ‘’దసరా నాకు చాలా స్పెషల్ మూవీ. తెలుగు సినిమా గురించి నా సహకారం ఏమిటని చాలా సార్లు ఆలోచించే వాడిని. తెలుగు, ఇండియన్ సినిమాకి ఈ ఏడాది నా తరపున నుంచి సహకారం… శ్రీకాంత్ ఓదెల. అది ఎందుకో, ఎలాంటి సినిమా తీశాడో మార్చి 30న తెలుస్తుంది. సినిమా నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. గత ఏడాది తెలుగు సినిమా నుంచి ఆర్ఆర్ఆర్, కన్నడ నుంచి కేజీఎఫ్ వచ్చింది. చాలా నమ్మకంగా చెబుతున్నాను.. ఈ ఏడాది తెలుగు సినిమా నుంచి దసరా వస్తోంది’’ అని చెప్పుకొచ్చారు నాని.