హీరోలు నిర్మాతలుగా మారడం కొత్త కాదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల నుండి కొనసాగుతుంది. ఈమధ్య ఈ ట్రెండ్ ఇంకాస్త జోరందుకుంది. యువ హీరోలు కూడా నిర్మాణం వైపు వస్తున్నారు. క్రేజీ స్టార్లు నాని, విజయ్ దేవర కొండ ఇప్పుడు నిర్మాణం వైపు యాక్టివ్ గా అడుగులు వేస్తున్నారు. నాని ఇప్పటికే ‘అ’సినిమా తీశాడు. తాజాగా విశ్వక్ సేన్ హీరోగా ‘హిట్’ అనే సినిమాకి క్లాప్ కొట్టాడు. ఈ సినిమా బడ్జెట్ పై ఓ వార్త తెలిసింది. కేవలం కోటిన్నర బడ్జెట్ తో చాలా లిమిటెడ్ సరంజామతో ఈ సినిమాని తీసేయాలని దర్శకుడికి కండీషన్ పెట్టాడట నాని.
విజయ్ దేవర కొండ నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’ వ్యవహారం కూడా ఇలానే వుంది. ఈ సినిమా చూసిన జనాలు దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. ”షార్ట్ ఫిల్మ్ ని తీసి థియేటర్ లోకి ఎలా వదిలారు ,,? ఇలాంటి ఉప్మా సినిమా తీసి ఎవరి జేబులు నింపుకోవాలని చూస్తున్నారు” అంటూ మండిపడుతున్నారు.
నిజమే చాలా దారుణంగా వున్నాయి ‘మీకు మాత్రమే చెప్తా’ నిర్మాణ విలువలు. తనకున్న కేజ్ దృష్ట్యా ప్రచారం చేస్తే సినిమా పాస్ అయిపోతుందనే కాన్ఫిడెన్స్ విజయ్ లో కనిపించింది. వాస్తవం కూడా అదే. కేవలం తన కేజ్ తో సినిమా నడిచిపోతుందని అనుకున్నాడు విజయ్. అయితే అందులో సినిమా లక్షణాలు లేకపోయేసరికి బాగా అప్సట్ అయ్యారు ప్రేక్షకులు. ‘విజయ్ మరీ ఇంత డబ్బా కొట్టుకోవడం అవసరమా ?’ అంటూ మండిపడ్డారు టికెట్టు కొని షార్ట్ ఫిల్మ్ లాంటి సినిమా చూసిన ప్రేక్షకులు.
ఇప్పుడు నాని వ్యవహరం కూడా అలానే వుంది. ‘అ’ సినిమా తీసిన నాని విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఇది కూడా బడ్జెట్ సినిమానే. ఒక రెస్టారెంట్ లో మొత్తం సినిమా ముగించేశారు. స్క్రిప్ట్ లో ఆ బలం వుండటం వల్ల,, అలాగే కాజల్, నిత్యామీనన్, రెజీనా.. లాంటి స్టార్లు నానిపై వున్న అభిమానంతో లాభాపేక్ష లేకుండా నటించడం వల్ల అది నడిచిపోయింది. కానీ విశ్వక్ సేన్ తో తీయబోతున్న సినిమాకి కధ డిమాండ్ చేసినా.. బడ్జెట్ కోసి పారేశాడట నాని.
ఏదేమైనా హీరోలుగా సినిమాలు చేసేటప్పుడు అన్నీ గొప్ప స్థాయిలో ఉండేలా చూసుకునే మన స్టార్లు.. నిర్మాతలుగా మాత్రం చాలా పిసినారులుగా మారిపోతున్నారు. ఇప్పుడు నాని కూడా విజయ్ దేవరకొండనే ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. మరి నిర్మాణ విషయంలో ప్రస్తుతం విజయ్ ఎదురుకుంటున్న విమర్శలనే నాని కూడా ఎదురుకుంటాడేమో..