మీడియం సైజు హీరోల్లో ఎంటర్టైన్మెంట్ పంచే వాళ్లు చాలా తక్కువ. నానిని తీసుకోండి. తను మంచి ఎంటర్టైనర్. సన్నివేశంలో బలం ఉన్నా, లేకపోయినా.. తన కామెడీ టచ్‌తో, ఎక్స్‌ప్రెషన్స్‌తో లాగించేస్తాడు. అష్టాచమ్మా, భలే భలే మగాడివోయ్, ఎంసీఏ.. ఇవన్నీ కామెడీ టచ్ ఉన్న సినిమాలే. వాటిలో నాని.. వీర విహారం చేసి.. సింగిల్ హ్యాండ్ తో సినిమాల్ని లాక్కొచ్చేశాడు. ఈ తరహా కథలకు, పాత్రలకు నానిని కొట్టేవాడే లేడు అనుకున్నారంతా. ఇప్పుడు విజయ్ దేవరకొండ వచ్చాడు. అర్జున్ రెడ్డి లాంటి సూపర్ డూపర్ హిట్ విజయ్ ఖాతాలో ఉండొచ్చు. కానీ కామెడీ టైమింగ్ పూర్తి స్థాయిలో బయటపడింది మాత్రం `గీత గోవిందం`లోనే. ఈ సినిమాలో చాలా సన్నివేశాల్ని కేవలం తన కామెడీ టైమింగ్‌తో నెట్టుకొచ్చేశాడు. ఈ విషయంలో నానికి గట్టి పోటీ దారుడు వచ్చాడే అనుకోవాలి. నానిని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథలకు ఇప్పుడు విజయ్ కూడా మంచి ఆప్షన్ అనుకోవాలి. పైగా విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. నానిలానే యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. `గీత గోవిందం`తో ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కూడా లాగేసుకున్నాడు. సో… ఇక మీదట నాని ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే.