మన యువ హీరో నాని.. రజనీకాంత్‌కి వీరాభిమాని. ఇప్పుడు రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం ఆడియో ఫంక్షన్‌కి చీప్ గెస్ట్ అయిపోయాడు. ఈ సినిమాపై నానికీ భారీ అంచనాలున్నాయట. ఈ సినిమాకోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. అంటున్నాడు నాని. అయితే రోబో 2కీ.. కబాలికీ ఓ పోలిక తీశాడు నాని. ”శంకర్ సార్ అంటే నాకు చాలా అభిమానం. కాకపోతే రోబో 2 గురించి అంత ఆసక్తిగా ఎదురుచూడడం లేదు. నేను కబాలి కోసమే వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే సూపర్ స్టార్‌ని రోబోగా చూడడం కంటే.. ఓ బాషాలా చూడడంలోనే ఎక్కువ కిక్ ఉంది” అంటున్నాడు. ప్రస్తుతం కబాలి తెలుగు పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెక్షన్ లో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి రజనీకాంత్ రాకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తోంది. మోహన్‌బాబు వస్తారని ప్రచారం సాగినా.. ఆయనా ఈ పోగ్రాంకి డుమ్మా కొట్టేశారు.