భలే భలే మగాడివోయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాని ఆ సినిమా జోష్ ని కొనసాగిస్తూ ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఆదారిలోనే మణిరత్నం సినిమాలో ఛాన్స్ కొట్టేసే సరికి స్టార్ తిరిగి పోయింది అనుకున్నారంతా.. కాని తెలుస్తున్న వార్తల ప్రకారం మణిరత్నం సినిమా నుండి నాని తప్పుకున్నాడని టాక్. ముందు కార్తి దుల్కర్ అనుకున్న ఈ సినిమా నుండి దుల్కర్ ని తప్పించి నానిని పెట్టుకున్నాడని అన్నారు. మళ్లీ ఫైనల్ గా నానిని కూడా తప్పించాడని అంటున్నారు.
అయితే తెలుస్తున్న మరో న్యూస్ ఏంటంటే నానిని కాదని అదే సినిమాని వేరే స్టార్ కాస్ట్ తో చేయనున్నాడట మణిరత్నం. నాని రెమ్యునరేషన్ ఎక్కువ అడగబట్టే ఈ ప్రాజెక్ట్ నుండి నానిని తప్పించడానికి మెయిన్ రీజన్ అంటున్నారు. ఇప్పటికే చాలా మంది మారిన ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ అంతా కన్ ఫ్యూజన్ గా తయారయ్యింది.. మణిరత్నం ఎందుకు ఇలా చేస్తున్నాడని వార్తలు వస్తున్నా తను అనుకున్న బడ్జెట్ లో అనుకున్న తారాగణం వస్తేనే సినిమా స్టార్ట్ చేస్తా అని మొండిగా ఉన్నాడట.. మరి ఏ హీరోతో మణిరత్నం సినిమా ఉంటుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు.