నాని ‘అంటే సుందరానికి’ బాక్సాఫీసు దగ్గర నిరుత్సాహ పరిచింది. కానీ… నాని మార్కెట్ పై అది ఎలాంటి ప్రతికూల ప్రభావాన్నీ చూపించలేకపోయింది. దానికి సాక్ష్యమే.. ‘దసరా’ బిజినెస్. ఈ సినిమా ఈమధ్యే పట్టాలెక్కింది. ఫస్ట్ లుక్ తప్ప ఇంకేదీ బయటకు రాలేదు. అప్పుడే నాన్ థియేటరికల్ రైట్స్ హాట్ కేకులా అమ్ముడుపోయాయి. ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్.. ఇలా అన్నీ కలిపి రూ.47 కోట్లు వచ్చాయని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఈ సినిమాకి రూ.50 నుంచి రూ.60 కోట్ల బడ్జెట్ అవ్వనుంది. అంటే… విడుదలకు ముందే ఈ సినిమా సేఫ్ సైడ్ లో ఉన్నట్టే. ఓ కొత్త దర్శకుడి సినిమాకి ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం నాని స్టామినాకు నిదర్శనంగా మారింది. తొలిసారి నాని చేస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది. మాస్లుక్తో దర్శనమివ్వడం, సుకుమార్ శిష్యుడి సినిమా కావడంతో.. ఈసినిమాపై మంచి బజ్ నడుస్తోంది. హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ తీర్చిదిద్దారు. అందులోనే షూటింగ్ జరుగుతోంది.