ఎన్నడు రాని విధంగా ఈ సారి సంక్రాంతికి నందమూరి ఇద్దరు హీరోలు పోటీ పడక తప్పట్లేదు. ఫ్యాన్స్ ని తర్జన భర్జనలో పడేసిన నందమూరి నట సింహం బాలకృష్ణ డిక్టటర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో రిలీజ్ లు సంక్రాంతికి ఫైనల్ అవ్వడం ఈ సారి పొంగల్ వార్ లో బాబాయ్ అబ్బాయ్ ల ఫైట్ తప్పేట్టు లేదు. అంతకుముందు బాబాయ్ సినిమా వస్తే తాను తప్పుకుంటా అని చెప్పిన ఎన్టీఆర్ తగ్గేదే లేదు కచ్చితంగా పోటీలో నిలబడాలని ఫిక్స్ అయ్యాడనుకుంటా అందుకే దీపావళి కానుకగా రిలీజ్ చేసిన పోస్టర్స్ లో పొంగల్ రిలీజ్ అని వేశాడు.
అయితే కొద్దికాలంగా బాలయ్య, ఎన్టీఆర్ ల మధ్య దూరం ఏర్పడిందన్న వార్త నిజమే అయినా ప్రస్తుతానికి కళ్యాణ్ రామ్ వీరిద్దరిని కలిపి నందమూరి ఫ్యానిలీని మళ్లీ ఒకటి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఎన్టీఆర్ ని కళ్యాణ్ రామ్ సినిమా ప్రతి వేడుకకి పిలిచి ఫ్యాన్స్ ని ఉత్తేజ పరుస్తున్నాడు. అసలే ఇద్దరు మధ్య కాస్త డిస్టెన్స్ ఉన్న ఈ టైంలో బాబాయ్ కి పోటీగా అబ్బాయ్ సినిమా దిగడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. అయితే కేవలం ఒక్క సినిమా వచ్చి పండుగని సెలబ్రేట్ చేయకుండా రెండు సినిమాలతో వచ్చి నందమూరి అభిమానులకు డబుల్ ధమాకా సిద్ధమయ్యారన్నది అసలు మ్యాటర్.
పోటీ సినిమాలకే తప్ప వ్యక్తిగతంగా కాదు అని ఎన్టీఆర్ సంకేతాలిస్తున్నా జై బాలయ్య అని పిలిచే నందమూరి అభిమానులు డిక్టేటర్ కి పోటీగా నాన్నకు ప్రేమతో రిలీజ్ ని ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. మరి టైగర్, సింహం పోరులో నెగ్గేదెవరో తెలుసుకోవాలంటే పండుగ దాకా వెయిట్ చేయాల్సిందే.