ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్లో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన ‘నాన్నకు ప్రేమతో..’ ఎట్టకేలకు సెన్సార్ వరకు వచ్చింది. మొన్నటి వరకు అసలు జనవరి 13న ఈ చిత్రం రిలీజ్ వుంటుందా? లేదా? అనే చర్చలు టాలీవుడ్ అంతా జరిగాయి. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ వివాదంతో రెండు రాష్ట్రాలు అల్లకల్లోలం అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పాతబస్తీలో ‘నాన్నకు ప్రేమతో’ పోస్టర్లను తగలబెట్టడమే కాకుండా ఆ పోస్టర్‌తో ముస్లిమ్స్ అంతా ఎన్టీఆర్ డౌన్ డౌన్ అంటూ ర్యాలీ నిర్వహించారు. ముస్లిం మత పెద్దల జోక్యంతో, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ క్షమాపణతో ఆ వివాదానికి తెరపడింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా ఎలా వుండబోతోంది? ఎన్టీఆర్ తన కొత్త సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చెయ్యబోతున్నాడు? ఎలాంటి భారీ ఓపెనింగ్స్ సాధించబోతున్నాడు? అనే విషయాలపై డిస్కషన్స్ మొదలయ్యాయి. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రంలోని కంటెంట్‌కి, ఎన్టీఆర్ టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్కి చాలా ఇంప్రెస్ అయిన సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. మరో పక్క ఈ చిత్రాన్ని మొదటిరోజే చూసెయ్యాలని ఉత్సాహంతో వున్న ప్రేక్షకులు, అభిమానుల అడ్వాన్స్ బుకింగ్స్‌తో మొదటిరోజు అన్ని షోలు హౌస్‌ఫుల్ అయిపోయాయి. జనవరి 13న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అవుతున్న ఈ ‘నాన్నకు ప్రేమతో’ ఎంతవరకు ప్రేక్షకుల, అభిమానుల ప్రేమను పొందుతుందో చూడాలి.