షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టి దర్శకుడైపోయిన వాళ్లలో ఆర్.ఎస్ నాయుడు ఒకరు. `నన్ను దోచుకుందువటే`తో దర్శకుడిగా మారాడు. ఈ సినిమాకి టాక్, బజ్ బాగానే ఉన్నా వసూళ్లు అంత ఆశాజనకంగా రాలేదు. అయితే పెట్టిన పెట్టుబడికి మాత్రం గిట్టుబాటు అయిపోయింది. దర్శకుడిలోనూ విషయం ఉందన్న సంగతి అర్థమైంది. దాంతో ఆర్.ఎస్ నాయుడుకి రెండో అవకాశం ఈజీగానే వచ్చేసింది. `పడి పడి లేచె మనసు` నిర్మాత సుధాకర్… నాయుడికి అడ్వాన్స్ ఇచ్చారు. అయితే కథేంటి? హీరో ఎవరు అనేది మాత్రం తేలలేదు. కేవలం కర్చీఫ్ వేశారంతే. కానీ.. నాయుడు ఆలోచనలు వేరుగా ఉన్నాయి. శర్వానంద్‌ని హీరోగా తీసుకొస్తే… తాను సినిమా చేయడానికి రెడీ అంటున్నాడట. యువ దర్శకులతో సినిమాలు చేసినప్పుడల్లా శర్వా హిట్టు కొట్టాడు. తాను కూడా ఫ్రెష్ ఐడియాల కోసం వెదుకుతున్నాడు. అయితే చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. దాంతో పాటు గీతా ఆర్ట్స్‌కి కమిటై ఉన్నాడు. వీటి మధ్య నాయుడుకి అవకాశం ఇస్తాడా, లేదా అనేది చూడాలి. నాయుడు చెప్పే కథలో దమ్ముంటే మాత్రం… రెండో సినిమా శర్వాతో పక్కా అయిపోతుంది.