చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టి ఆయనను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్న వైసీపీ అసురులకు టీడీపీ వైపు నుంచి ప్రజల్లోకి వస్తున్న నేతలు ఒక్కొక్కరూ షాకులు ఇస్తున్నారు. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి ప్రారంభించిన యాత్ర మొదటి రోజు.. అంచనాలకు మించి సక్సెస్ అయింది. ఆమె స్పీచ్ వైరల్ అయింది. మహిళల్ని ఏకం చేసే నాయకత్వాన్ని వైసీపీ టీడీపీకి అందించిందని స్పష్టమైంది.
జగన్ రెడ్డిలా కాదు చూసి చదవాల్సిన అవసరం లేదు !
గుడ్మార్నింగ్ చెప్పాలన్నా చూసి చదివే జగన్ రెడ్డి వ్యవహారం రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఆయన ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. కానీ ప్రతిపక్ష నేతల్ని అసభ్యంగా మాట్లాడటం తప్ప… విషయ పరిజ్ఞాన లేదు. అందుకే కొత్తగా ఏ లీడర్ వచ్చినా.. జగన్ రెడ్డితో పోల్చుకుంటారు. నారా భువనేశ్వరి అసలు రాజకీయాల్లో లేరు. బహిరంగసభల్లో ప్రసంగాలు చేయలేదు. కానీ మొదటి ఆమె నిజం గెలవాలి పేరుతో బహిరంగసభలో ప్రసంగించారు. ఆమె స్పీచ్.. విజయమ్మలాగా ఉంటుందని అందరూ అనుకున్నారు. విజయమ్మ ప్రసంగాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు.కానీ నారా భువనేశ్వరి పూర్తి స్థాయి విషయ పరిజ్ఞానంతో చూసి కాకుండా.. సొంతంగా ప్రసంగించారు. ఆమె ప్రసంగం మహిళాలోకం మనసుల్ని తాకింది.
నాయకత్వ సామర్త్యం ఉందని నిరూపించిన నారా భువనేశ్వరి
ఎన్టీఆర్ బిడ్డ అయినా రాజకీయాల్లోకి రావాలని భువనేశ్వరి ఎప్పుడూ అనుకోలేదు. ఆధారాలు లేని కేసుల్లో జైల్లో పెట్టి యాభై రోజులు అవుతున్నా కనీసం బెయిల్ రాకుండా చేస్తున్న ప్రయత్నాలతో రాష్ట్రంలో ఉన్న అరాచక పరిస్థితుల్ని ప్రజలకు వివరించడానికి .. తమ కుటుంబానికి జరుగుతున్న అన్యాయనాన్ని చెప్పడానికి.. నిజం గెలిపించేదుకు అందరూ చేతులు కలపాల్సిన అవసరాన్ని చెప్పేందుకు బయటకు వచ్చారు. ఆమె ఎక్కడా సింపతీ కార్డు ప్లే చేయడం లేదు. నిజం గెలవాలంటే పోరాడదాం…చేయి కలుపుదామంటున్నారు. నారా భువనేశ్వరి స్పష్టమైన విజన్ తో ఉన్నారు. ఆమె ప్రసంగానికి..సభకు వచ్చిన స్పందన చూసి.. వైసీపీ నేతలకూ మైండ్ బ్లాంక్ అయింది. అందుకే వైసీపీ సోషల్ మీడియా కూడా డ్యూటీ ఎక్కేసింది.
మహిళా లోకాన్ని ఏకం చేయడం ఖాయం !
చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చినా నారా భువనేశ్వరి తన రాజకీయయాత్రలు కొనసాగించే అవకాశం ఉంది. నిజాన్ని గెలిపించేందుకు ఆమె మహిళల్ని ఏకం చేయడానికి నిరంతరం శ్రమించే అవకాశం ఉంది. ఎలా చూసినా.. కుల, మతాలకు అతీతంగా ఉండే మహిళా వర్గానికి ఆకట్టుకునే ఓ బలమైన నేత .. టీడీపీకి లభించినట్లయింది. చంద్రబాబును జైల్లో పెట్టి టీడీపీని బలహీనం చేద్దామనుకునే ప్రయత్నాలు నెరవేరకపోగా మరితం బలోపేతం చేసినట్లయిందని వైసీపీ నేతలు గొణుక్కుంటున్నారు.