తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంది. ఒకరి తర్వాత ఒకరు పది లేయర్ల వరకూ నాయకత్వాన్ని ఖరారు చేసుకున్నారు. మెల్లగా వారిని తెరపైకి తీసుకు వస్తున్నారు. ఆధారాలు కేసుల్లో వ్యవస్థల్ని మేనేజ్ చేసి జైల్లో పెట్టినా సరే పార్టీకి సమస్య లేకుండా ముందుకు సాగడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నారా బ్రాహ్మణి ఎగ్రెసివ్ గా తెరమీదకు వస్తున్నారు. ప్రజాసమస్యలపై స్పందిస్తున్నారు. తాజాగా ఆమె అంగన్వాడి మహిళలు, టీడీపీ మహిళా నేత పరిటాల సునీత పై పోలీసుల కర్కసంపై ఘాటుగా స్పందించారు. ఏపీలో శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీల్లో ప్రభుత్వ ప్రేరేపిత హింస చూసి షాక్ కు గురవుతున్నానన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే అంగన్వాడి కార్మికులపై దాడులు దుర్మార్గమన్నారు. న్యాయం కోసం మహిళా నేతలు శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్దంగా పోరాడుతూంటే.. వారిపై దాడులకు పాల్పడటం శోచనీయమన్నారు. బ్రాహ్మణి సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన స్పందనలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే బ్రాహ్మణి రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సంఘిభావం తెలిపేందుకు వస్తున్న నేతలతో రాజకీయాలు చర్చిస్తున్నారు. జనసేన నేతలు వచ్చి మాట్లాడుతున్నారు.
హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ ఉద్యోగులతో మాట్లాడారు. దాదాపుగా ప్రతి రోజూ రాజకీయాలపై మాట్లాడుతున్నారు. లోకేష్ పై తాజాగా కేసు పెట్టారు. అసలు సంబంధం లేని కేసులో .. ఏ 14గా చేశారు. చిత్ర విచిత్రమైన కేసులు పెట్టి ఎలాగైనా జైల్లో పెట్టగలమని నిరూపిస్తూండటంతో.. బ్రాహ్మణి ఇక రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఇక ముందు ఈ రాజకీయం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది.