విశాఖలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. విశాఖను సాఫ్ట్ వేర్ హబ్‌గా చేయడానికి నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నాలలో ఇదో అతి పెద్ద ముందడుగు. ఐటీ రంగం అభివృద్ధి సాధించడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు విశాఖకు ఉన్నాయి. కానీ జగన్ రెడ్డి సర్కార్ దాన్నో రియల్ ఎస్టెట్ డెన్ గా మార్చాలనుకుంది. దందాల కేంద్రంగా చేయాలనుకుంది. కానీ ప్రజలు కాపాడుకున్నారు. ప్రజలు తమపై పెట్టిన బాధ్యతను లోకేష్ సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. టీసీఎస్ వచ్చిందంటే…. సాఫ్ట్ వేర్ పరిశ్రమ ఎకో సిస్టమ్ ఏర్పడినట్లే. అది వైజాగ్ ఐటీ ఇండస్ట్రీ రాతను మార్చేస్తుంది.
పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగిస్తున్న లోకేష్
పెట్టుబడులను ఆకర్షించడం.. పరిశ్రమల్ని ఏపీకి తీసుకు రావడంలో నారా లోకేష్ స్టైల్ భిన్నం. ఎలాంటి హంగూ ఆర్బాటాలు ఉండవు. ఆయన పెట్టుబడుల వేటకు వెళ్తున్నారని ప్రచారం ఉండదు. కానీ పని పూర్తి చేసుకుని వస్తారు. నారా లోకేష్ గ్రౌండ్ వర్క్ పూర్తిగా చేస్తారు. ఏఏ కంపెనీలు విస్తరణ ప్రణాళికాల్లో ఉన్నాయో తెలుసుకుని వాటిని ఏపీకి ఆహ్వానించేలా ఓ ప్రత్యేకమైన వ్యూహన్ని అమలు చేస్తున్నారు. ప్రాథమిక స్థాయి సంప్రదింపుల నుంచి పూర్తి స్థాయిలో పెట్టుబడులకు రక్షణ ఉంటుందనే భరోసా ఇచ్చే వరకూ లోకేష్ కార్పొరేట్ వర్గాలకు ఎలా ఉండాలో అలా ఉంటున్నారు. ఓ యువ రాజకీయనాయుకుడు ఇంత మంచి విజన్ తో వస్తే తాము ఎందుకు తిరస్కరించాలని పారిశ్రామికవేత్తలకు ఆయనతో మాట్లాడితే అనిపిస్తుంది. అందుకే టీసీఎస్ లాంటికంపెనీలను ఒకటి,రెండు మీటింగ్‌లతోనే ఒప్పించగలిగారు.
గతంలో మంత్రిగా ఉన్న సమయంలోనూ కీలక కంపెనీలతో చర్చలు
ఏపీలో వచ్చిన, వస్తున్న ప్రతి మల్టీ నేషనల్ కంపెనీ పెట్టుబడి వెనుక లోకేష్ శ్రమ ఉంది. తొలి సారి మంత్రిగా అయినప్పుడు ఐటీ, పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు. పంచాయతీ రాజ్‌లో ఉత్తమ పనితీరుకు దేశంలో ఎవరికి రానన్ని అవార్డులు ఆ శాఖకు వచ్చాయి. ఐటీ , పరిశ్రమల మంత్రిగా ఆయన పని తీరు తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ హబ్‌లో ఉన్న పరిశ్రమలే సాక్ష్యం. టీడీపీ హయాంలో ఏర్పాటైన పరిశ్రమల్ని ఆయన తీసుకు వచ్చారు. ఇప్పుడు మరోసారి మంత్రి అయిన తర్వాత యువతకు ఉపాధి కల్పించడం.. రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చడంలో ఆయన తనదైన వ్యూహం పాటిస్తున్నరు.
పారిశ్రామిక వేత్తల్ని ఆకట్టుకుంటున్న లోకేష్ విజన్
నారా లోకేష్ యువ నేత. ఆయనకో విజన్ ఉంది. ఆ విజన్ కు కేంద్రం డబ్బులు కావు. అభివృద్ధి, మన దగ్గర ఒక్క పరిశ్రమ వస్తే వందల మందికి ఉపాధి లభిస్తుంది. పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి లభిస్తుంది. బతుకులు బాగుపడతాయి . రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఇది నారా లోకేష్ ఆలోచనా విధానం. అది పారిశ్రామిక వేత్తలనూ ఆకట్టుకుంటోంది. వచ్చే ఐదేళ్లలో నారా లోకేష్ .. మరిన్ని దిగ్గజ కంపెనీలను ఏపీకి తీసుకురాగలరు. అందులో సందేహమే లేదు.