రాజధాని అమరావతి నుండి విశాఖపట్నం తరలించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ సందర్భంగా రాజధాని గ్రామాలలో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే 151 మంది ఎమ్మెల్యేలు కలిగిన అధికార పార్టీ, పోలీసులను మోహరించి మరీ తన నిర్ణయాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఒకరకంగా చూస్తే రాజధాని ప్రాంతంలో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. జగన్ నిరంకుశంగా వ్యవహరిస్తూ పోలీసులను మోహరించి పరిపాలిస్తున్నాడు అంటూ లోకేష్ విమర్శలు చేశారు.
లోకేష్ ట్వీట్ చేస్తూ, “ఇంటికి పది మంది పోలీసులా? ఇళ్ల ముందు నెట్లు పట్టుకొని నిలబడటం ఏంటి? రాజధాని గ్రామాల్లో యుద్ధ వాతావరణం ఎందుకు? పాకిస్తాన్ బోర్డర్ కంటే ఎక్కువగా రాజధాని గ్రామాల్లో పోలీసులను దింపుతారా? ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని అడగటం ప్రజలు చేసిన తప్పా? అడుగుకో పోలీసు, లాఠీలు, ముళ్ల కంచెలతో రాజధానిని తరలించాలి అనే పట్టుదల ఎందుకు? రాజధాని విభజన నిర్ణయంలో పసలేదు కాబట్టే వైకాపా ప్రభుత్వం ఇంత నిరంకుశత్వంగా వ్యవహరిస్తోంది.” అని విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అధికార వికేంద్రీకరణ పై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి అంటూ వైసిపి నేతలు చేస్తున్న వాదనలో ఏమాత్రం పస లేదని, రాజధాని గ్రామాల్లో పోలీసులను మోహరించిన తీరు దీనికి నిదర్శనమని ప్రజలు భావిస్తున్నారు.
ఇంటికి పది మంది పోలీసులా? ఇళ్ల ముందు నెట్లు పట్టుకొని నిలబడటం ఏంటి? రాజధాని గ్రామాల్లో యుద్ధ వాతావరణం ఎందుకు? పాకిస్తాన్ బోర్డర్ కంటే ఎక్కువగా రాజధాని గ్రామాల్లో పోలీసులను దింపుతారా? ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని అడగటం ప్రజలు చేసిన తప్పా?(1/2) pic.twitter.com/KQ0QzR6PAy
— Lokesh Nara (@naralokesh) January 20, 2020