ఎక్కడ ఉన్నా, నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా నారా లోకేష్ వదులుకోరు. ఆయన బాటలోనే బ్రాహ్మణి కూడా సపోర్టు చేస్తారు. దానికి తాజాగా ఉదాహరణ.. మంగళగిరి చేనేతకు వారే బ్రాండ్ అంబాసిడర్లుగా మారడం. పండుగ సందర్భంగా నారా లోకేష్ మంగళగిరి చేనేతలు సిద్ధం చేసిన ఓ చీరను తన సతీమణికి గిఫ్టుగా ఇచ్చారు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. బ్రాహ్మణి కూడా అద్భుతమైన చీర అని సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు. ఈ భార్యభర్తలు మంగళగిరి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి చేసిన ప్రచారం వైరల్ గా మారుతోంది.
మంగళగిరి చేనేత కార్మికుల కోసం.. అక్కడి పరిశ్రమ కోసం నారా లోకేష్, నారా బ్రహ్మణి టీడీపీ గెలవక ముందు నుంచే కృషి చేస్తున్నారు. టాటా బ్రాండ్ అయిన టానేరియా ద్వారా మంగళగిరి చేనేతను మార్కెటింగ్ చేసే అవకాశం కల్పించారు . వారి షోరూంలలో దేశవ్యాప్తంగా మంగళగిరి చేనేతను అమ్మే ఏర్పాట్లు చేశారు. అలాగే మాస్టర్ వీవర్స్ కోసం ప్రత్యేకమైన మగ్గాలు కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇలా లోకేష్ , బ్రాహ్మణి మంగళగిరి చేనేతను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఓట్లు వేసిన ప్రజల కోసం.. నారా లోకేష్ తో పాటు ఆయన కుటుంబం కూడా పాటుపడుతున్నారు. మంగళగిరి నియోజకవర్గల ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు వినూత్న చర్యలు చేపడుతున్నారు. అక్కడ ఉన్న ఇండస్ట్రీని బలపరిచేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. వీరి ప్రయత్నాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.