మంగళగిరిలో ప్రజలు వాకింగ్ కు వెళ్లేంందుకు అటవీ పార్క్ ను ఉపయోగించుకుంటారు. ఎన్నికల సమయంలో ప్రజలు ఆ పార్క్ లోకి వాకింగ్‌కు వెళ్లడానికి డబ్బులు కట్టాల్సి వస్తుందని చెప్పారు. దాంతో ఆ డబ్బులు కట్టకుండా వాకింగ్ కు వెళ్లే అవకాశాన్ని కల్పిస్తానని నారా లోకేష్ హామీ ఇచ్చారు. అది చాలా చిన్న హామీ..కానీ గుర్తుంచుకుని ఆ హామీని ఇటీవల నెరవేర్చారు. ప్రభుత్వ పరంగా సాధ్యం కాకపోతే సొంత నిధులను ఇచ్చారు. ఇంత చిన్న హామీని లోకేష్ పక్కాగా గుర్తు పెట్టుకున్నారంటే.. ఇక పెద్ద హామీల పట్ల ఎలాంటి నిబద్ధత చూపిస్తారో చెప్పాల్సిన పని లేదు.
పేదల ఇంటి సమస్యలకు చట్టబద్ధ పరిష్కారం
నారా లోకేష్ మొదటి సారి మంగళగిరిలో పోటీ చేసినప్పుడు ఓడిపోవడానికి కారణం.. లోకేష్ గెలిస్తే ఇళ్లు తొలగిస్తారని ప్రచారం చేయడం. మంగళగిరి నియోజకవర్గంలో కొండవాలులో..రోడ్డు పక్కన ఇళ్లు నిర్మించుకున్న అనేక మంది ఈ కారణంగా వైసీపీకి ఓటేశారు. ఈ సారి లోకేష్.. ఈ విషయంలో చాలా పక్కాగా ఉన్నారు. తాను గెలిస్తే ఇంటికే పట్టాలు తెచ్చిస్తానని హామీ ఇచ్చారు. ఆ ప్రకారం ప్రక్రియ ప్రారంభించారు. కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఇంటి పట్టాలను స్వయంగా ఇంటికెళ్లి ఇస్తున్నారు. అటవీ భూముల విషయంలో సమస్యలు ఉండటంతో అటవీ భూముల్లో ఇళ్లు కట్టుకున్నవారికి మూడో దశలో ఇంటి పత్రాలు పంపిణీ చేయనున్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు
అభివృద్ధి పనుల విషయంలోనూ లోకేష్ ఎక్కడా నిర్లక్ష్యంచేయడం లేదు. తన దృష్టికి వచ్చిన ప్రతి పనికి ఏదో విభాగం నుంచి నిధులు కేటాయించి పనులు చేయిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా చాలా పనులు జరుగుతున్నాయి. గ్రామాల్లో కొంత ఖర్చుతో పూర్తయ్యే చాలా పనులు వివిధ కారణాలతో పెండింగ్ లో ఉండిపోయాయి. వాటన్నింటికీ మోక్షం కల్పిస్తున్నారు.
ప్రజలకు అందుబాటులో లోకేష్ !
ఇక ప్రజలకు వ్యక్తిగతంగానూ సాయం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎవరు పెళ్లి చేసుకున్నా.. కార్డు టీడీపీ కార్యాలయంలో అందచేస్తే వారికి పెళ్లి కానుకలు వెళ్తాయి. నారా లోకేష్ స్వయంగా వెళ్లలేకపోయినా ఆయన టీం పెళ్లికి హాజరవుతుంది. వ్యక్తిగత సమస్యలను .. తీర్చేందుకు ఆయన సొంత డబ్బును వెచ్చిస్తున్నారు. మొత్తంగా మంగళగిరి నియోజకవర్గానికి పెద్దకుమారుడిగా మారారు నారా లోకేష్. అక్కడి ప్రజలు చూపించిన అభిమానాన్ని మరింతగా పెంచుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.