నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించి వెయ్యి రోజులు అవుతుంది. ఉద్యమంలా ప్రారంభమైన.. ఉప్పెనలా మారి ఇప్పుడు ప్రభంజనం అవుతోంది. మొదట్లో ఆయన పాదయాత్ర చేయగలరా అన్న అనుమానం టీడీపీ శ్రేణుల్లోనే ఉండేది. ఎందుకంటే ఆయనపై అంతలా ఇతర పార్టీలు నెగెటివ్ ప్రచారం చేశాయి. ఆయనపై బాడీ షేమింగ్ కు పాల్పడ్డాయి. వ్యక్తిత్వ హననం చేశాయి. అయితే అన్నింటికీ సమాధానం పాదయాత్ర ద్వారానే ఇస్తున్నారు లోకేష్. కాళ్లకు బొబ్బలెక్కాయని సింపతీ కోసం ప్రయత్నించడం లేదు. విశ్రాంతి లేకుండా నడుస్తున్నానని అలసటకు గురి కావడం లేదు. రోజంతా బిజీగానే ఉంటున్నారు. నాలుగైదు గంటలు మాత్రమే నిద్ర. మిగతా సమయం అంతా ప్రజల్లోనే.
లోకేష్ పడుతున్న కష్టాన్ని చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. ఆయనతో నడుస్తున్న వారందరికీ ఇదే పరిస్థితి. కానీ లోకేష్ పట్టుదలే వారికి ధైర్యం. ప్రజల కోసం ఎంత కష్టమైన పడటానికి తాను సిద్ధమని లోకేష్ నిరూపిస్తున్నారు. లోకేష్ ను ట్రోల్ చేయడానికి వైసీపీ కొన్ని వందల మందిని నియమించుకుంది. ఇంటలిజెన్స్ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. పార్టీ నేతల్ని కార్యకర్తల్ని పంపించి లోకేష్ తో వాగ్వాదానికి ప్రొత్సహిస్తున్నారు. కానీ ప్రతీ చోటా.. లోకేష్ తన వాదనా పటిమ వినిపిస్తున్నారు. మీరు వైసీపీ వాళ్లు అని వాళ్లను పక్కకు తోసేసి పోవడం లేదు. తన వాదన వినిపిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేసిందో చెబుతున్నారు. నిజాలు తెలుసుకుంటే తెలుసుకున్నారు లేకపోతే లేదు కానీ తాను చెప్పాల్సిన విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
మొత్తం నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర. ఇప్పటికి పావు శాతం పూర్తయింది. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మాత్రమే పూర్తయింది. కర్నూలులో జరుగుతోంది. కడప జిల్లాతో రాయలసీమలో పూర్తవుతుంది. రాయలసీమలో లోకేష్ పాదయాత్రకు వచ్చి న .. వస్తున్న ఆదరణ చూసి వైసీపీ నేతకు మైండ్ బ్లాంక్ అవుతోంది. జనం లేరని చెప్పడానికి చేసిన ప్రయత్నాలన్నీ రివర్స్ అయ్యాయి. అందుకే ఇప్పుడు ఆ ప్రయత్నాలు ఆపేశారు. ప్రతీ చోటా ప్రజలకు లోకేష్ ఇస్తున్న భరోసా భిన్నంగా ఉంటోంది. తాము వస్తే చేస్తామని వారికి నమ్మకం కలిగేలా చెబుతున్నారు. అన్ని వర్గాల వారినీ కలుస్తున్నారు. మద్దతు ఇస్తున్నారు. సాయం కోసం వచ్చిన వారిని నిరాశపర్చడం లేదు.
లోకేష్ గురించి గతంలో కోట్లు ఖర్చు పెట్టి నెగెటివ్ ప్రచారాన్ని విపక్షాలు చేశాయి . అందుకే లోకేష్ జీరో నుంచి ప్రారంభమయ్యారు . అది ఓ రకంగా ఆయనకు ప్లస్ పాయింట్ అయింది. తనపై ఉన్న అంచనాలను తలకిందులు చేస్తూ తానేంటో నిరూపించుకుంటున్నారు. ఇప్పటికే అద్భుతం సృష్టించారు.. మరో మూడు వేల కిలోమీటర్లు పూర్తయ్యే సరికి ఆయన ఇమేజ్ మాస్ లీడర్ గా పూర్తిగా మారిపోవడం ఖాయం అనుకోవచ్చు.