కష్టం వచ్చిన ఓ కార్యకర్త సాయం అడగకుండానే ఆత్మహత్య చేసుకోవడం నారా లోకేష్ ను బాగా ఇబ్బంది పెట్టింది. దీంతో ఆయన కార్యకర్తలకు మరింత దగ్గరగా ఉండటానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకున్నారు. ఓ ప్రత్యేకమైన మెయిన్ ఐడీని క్రియేట్ చేసుకున్నారు. అది పర్సనల్ మెయిల్ ఐడీ అని.. స్వయంగా ప్రతి మెయిల్ని నేనే స్వయంగా చూసి.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. “hello.lokesh@ap.gov.in” పేరుతో ఈ మెయిల్ ఐడీని స్వయంగా ప్రకటించారు.
నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమం కోసం టీడీపీలో ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే ఇంకా ఇంట్రావర్ట్ లు .. ఉన్నారని మధ్యవర్తులను.. తనను కలిసేందుకు ఇతరుల్ని సంప్రదించడానికి మొహమాటపడేవారు ఉన్నారని గుర్తించారు. అందుకో ఈమెయిల్ ఐడీని అందుబాటులోకి తెచ్చారు. మనిషి అన్నాక సమస్యలు ఉంటాయి.. టీడీపీ కార్యకర్తలు అతీతం కాదు. గత ఐదేళ్లుగా అనేక మంది పార్టీ కోసం పోరాడి కేసుల పాలయ్యారు. వీరందరికీ ఇప్పుడు టీడీపీ. హైకమాండ్ అండగా ఉంటోంది.
కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత సమస్యలు కూడా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడానికి కారణం అవుతుున్నాయి. అలాంటి వారు ఎవరో తమ దృష్టికి వస్తే కనీసం కౌన్సెలింగ్ ఇవ్వడానికి అయినా అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. లోకేష్ టీడీపీ కార్యకర్తల సంక్షేమం కోసమే ప్రత్యేకంగా ఓ టీంను ఏర్పాటు చేశారు. వారికి ఎలాంటి సాయం అవసరమైనా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారందర్నీ ఈ టీమ్ ఇప్పటికే కన్సల్ట్ చేస్తోంది. సమస్యలను తెలుసుకుంటోంది.