ఏపీలో త్వరలోనే మరో కొత్త పాలసీ రాబోతోంది. యాంటీ బెట్టింగ్ పాలసీ తీసుకురానున్నట్లు మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహిస్తూ ప్రముఖులు చేసే ప్రచారాన్ని నమ్మి ఎంతోమంది యువత బెట్టింగ్ బారిన పడుతోంది. ఫలితంగా బెట్టింగ్ లో సొమ్మును అంతా ధారబోసి ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీలో కొత్త పాలసీ తీసుకురానుంది ఏపీ ప్రభుత్వం.
ఇటీవల బెట్టింగ్ బెట్టింగ్ యాప్ లపై యూట్యుబర్ నా అన్వేష్ యుద్ధం ప్రకటించారు. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. తెలంగాణలో బెట్టింగ్ యాప్ లపై అన్వేష్ చేసిన పోరాటానికి ప్రభుత్వం స్పందించి.. వీటిని అరికట్టేందుకు చర్యలు చేపడుతామని పేర్కొంది. హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై కొరడా ఝుళిపించారు. తాము స్కిల్ గేమ్స్ యాప్లను మాత్రమే ప్రమోట్ చేశామని వాటికి సుప్రీంకోర్టు అనుమతి ఉందని ప్రకటించారు.కొంతమందిని విచారణకు పిలిచిన పోలీసులు తర్వాత ఈ కేసును సిట్ కు బదిలీ చేశారు.
ఈ నేపథ్యంలోనే గోవిందా పేరుతో ఓ బెట్టింగ్ యాప్ ఉందని, దానికి తమన్నాతోపాటు చాలా మంది ప్రముఖులు అన్ని రకాల సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో ప్రచారం చేస్తున్నారని లోకేష్ , పవన్ కళ్యాణ్ కోరుతూ అన్వేష్ ఓ వీడియో చేశారు. దీనిపై లోకేష్ వెంటనే స్పందించారు. ఈ బెట్టింగ్ యాప్ లపై చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో బెట్టింగ్ నిరోధక పాలసీని తీసుకువస్తామని హామీ ఇచ్చారు.