“నువ్ కనిపించకూడదు.. నీ పని తనం కనిపించాలి. అప్పుడే నువ్వు గుర్తుంటావు“ అనే విషయాన్ని పెద్దలు చాలా సార్లు…చాలా సందర్భాల్లో చెప్పి ఉంటారు. నిజంగా ఓ మినిషి గుర్తు ఉండాలంటే అతని ముఖాన్ని ఎదుటి వాడి ముఖం మీద ప్రింట్ వేసి రోజూ చూసి గుర్తు చేసుకోవడం కాదు. పనుల ద్వారా.. గుర్తుకు తెచ్చుకునేలా చేయాలి. అలా చేయడానికి ఎక్కువ స్కోప్ రాజకీయా ల్లో ఉంటుంది. జగన్ రెడ్డి లాంటి వాళ్లు అందరికీ గుర్తుండాలంటే.. ప్రతీ దానిపై తన ఫోటో వేసుకుంటే చాలనుకుంటారు. కానీ లోకేష్ లాంటి నేతలు మాత్రం.. తన పని వల్లే ఇతరులు తనను గుర్తించాలనుకుంటారు. ఇప్పుడు అదే చేస్తున్నారు.
పిల్లలపై రాజకీయ ప్రభావం లేకుండా జాగ్రత్తలు
విద్యాశాఖలో నారా లోకేష్ అనితర సాధ్యమైన మార్పులు చేస్తున్నారు. ముఖ్యంగా విద్యలోకి రాజకీయాలు రాకుండా చేస్తున్నారు. పిల్లలకు రాజకీయ వాసనలు అంటకుండా చేస్తున్నారు. రాజకీయాలకు సంబంధం లేని విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు. ఇందు కోసం ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాజకీయ సభలకు పిల్లలను తరలించడం అనే దాన్ని నిషేధించారు. అలాగే రాజకీయ నేతలు ఎప్పుడైనా స్కూళ్లకు వెళ్లినా అది అభివృద్ధి పనుల కోసం తప్ప.. రాజకీయం వెళ్లకూడదని దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో పుస్తకాలు, యూనిఫాం సహా దేనిపైనా .. రాజకీయ గుర్తులు ఉండకుండా చూస్తున్నారు.
విద్యార్థుల మనసులను కలుషితం చేసిన జగన్ పాలసీ
జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో సొమ్ము నుంచి పిల్లలకు పుస్తకాలు, యూనిఫాం ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకున్నారు. ప్రతి పుస్తకంపై ఆయన ఫోటో ఉండేది. ప్రతి వస్తువుపై ఆయన ఫోటో ఉండేది. పుస్తకాలను.. బ్యాగుల్ని వదిలి పెట్టలేదు. ప్రతీ వస్తువు వైసీపీ రంగులో ఉండేది. ఇలా విద్యార్థుల మనసుల్లో వైసీపీ ఉండాలని.. అంతా తాను ఇస్తున్నట్లుగా చెప్పుకోవాలని తాపత్రాయపడ్డారు. పథకాల బటన్లు నొక్కే ప్రోగ్రామ్ పేరుతో చివరికి రాజకీయ సభలకు కూడా పిల్లలను తీసుకెళ్లి వారి ముందు తన వెంట్రుక కూడా పీకలేరు లాంటి భాషను వాడేవారు. ఆయనకు పిల్లల భవిష్యత్ కన్నా.. వారి భవిష్యత్ ను పణంగా పెట్టి తనకు బానిసలుగా చేసుకుందామన్న కోరికే ఎక్కువగా ఉండేది.
పిల్లల భవిష్యత్ కు భరోసా – ప్రభుత్వాల విధి
నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. వారే మన భవిష్యత్ కూడా. వారి భవిష్యత్ బాగుంటేనే ఊరు.. రాష్ట్రం..దేశం భవిష్యత్ బాగుంటుంది. పునాదులు గట్టిగా ఉంటేనే వారు ఎంత ఎత్తుకైనా ఎదుగగలుగుతారు. పునాదులు బలహీనంగా ఉంటే.. వారు ఎదగలేరు. ఈ విషయంలో నారా లోకేష్ చాలా స్పష్టతతో ఉన్నారు. రాజకీయంగా పిల్లల్ని.. వారి భవిష్యత్ న ఉపయోగించుకోకుండా చక్కని మార్గం చూస్తున్నారు.