విద్యామంత్రిగా నారా లోకేష్.. సైలెంట్ గా తాను చేయాలనుకున్న మార్పులను చేస్తున్నారు. విద్యార్థులును , టీచర్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న లక్ష్యంతో ఆయన పెద్దగా ప్రచార చేసుకోవడం లేదు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే వారంతా పేద పిల్లలే. వారి భవిష్యత్ తీర్చిదిద్దడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నారు. పబ్లిసిటీ కన్నా వారి జీవితాలు బాగుండాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.
గత ప్రభుత్వం ఏ మాత్రం కసరత్తు చేయకుండా ఐబీ అని.. సీబీఎఎస్ఈ అని.. ఇంగ్లిష్ మీడియం అని విద్యార్థులపై రుద్దేసింది. ఫలితంగా అనేక మంది చదువు మధ్యలోనే ఆపేసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పడిపోయింది. ఆ పరిస్థితిని మార్చడానికి లోకేష్ ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులపై ఇంగ్లిష్ ఒకే సారి రుద్దకుండా…క్రమంగా నేర్పిస్తూ వెళ్లారని.. నిర్ణయించారు. అలాగే సిలబస్ లో కూడాకీలకమైన మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆపేసిన ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని పునరుద్ధరించారు.
విద్యావ్యవస్థను రాజకీయానికి దూరంగా ఉంచాలని లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ప్రభుత్వం పూర్తిగా రాజకీయమే చేసింది. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది. ఒక్క టీచర్ ను నియమించలేదు. పైగా నాథ్ – నేడు పేరుతో బల్లలు, రంగుల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టి అవినీతి చేశారు కానీ.. సౌకర్యాలు మెరుగుపడింది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్.. ఖచ్చితమైన మార్పులు చూపించే దిశగా అడుగులు వేస్తున్నారు.