యువగళం పాదయాత్రలో నారా లోకేష్ మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడల్లా పోలీసులు విరుచుకుపడుతున్నారు. మైకులు .. వాహనాలు సీజ్ చేస్తున్నారు. ఎవరో చెప్పకపోతే పోలీసులు అలా చేయరు. లోకేష్ ను మాట్లాడకుండా చేయాలని ఒత్తిడి తెస్తూండటంతో.. పోలీసులు … లోకేష్ మైక్ అందుకోగానే అడ్డం పడుతున్నారు. కుప్పంలో పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుండి అదే పరిస్థితి. ప్రసంగించడానికి పక్కనున్న మిద్దెలు.. లేకపోతే స్టూల్స్ వేసుకుని మాట్లాడాల్సి వస్తోంది.
ఒకప్పుడు నారా లోకేష్ మాట్లాడితే… ఆయన ఎక్కడైనా తప్పు మాట్లాడతారమో… ఎడిట్ చేసుకుని ట్రోల్స్ చేసుకుందామని వైసీపీ నేతలు ఎదురు చూస్తూ ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు లోకేష్ తడబడటం పూర్తిగా తగ్గిపోయింది. ఆయన నేరుగా పంచ్‌లు వేస్తున్నారు. సీఎం జగన్ పై ఘాటు కామెంట్లు చేస్తున్నారు. ఇవన్నీ సూటిగా తగులుతున్నాయి. ట్రోల్ వేసుకోవడానికి ఎలాంటి స్టఫ్ దొరకకపోగా… ఆయన స్పీచ్‌లోని పాయింట్లు సూటిగా తగులుతూండటంతో.. మాట్లాడకుండా చేయడమే మంచిదని అనుకున్నట్లుగా కనిపిస్తోంది. లోకేష్ పాదయాత్ర విషయంలో ఎప్పుడు ఎలా వ్యవహరించాలన్నది మానిటర్ చేసేందుకు సజ్జల ఓ టీమ్ ను నియమించారని చెబుతున్నారు. ఇందులో ఇంటలిజెన్స్ పోలీసులు కీలకంగా ఉన్నారని అంటున్నారు.
జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ మైక్ పెట్టుకుని మాట్లాడేవారు. పోలీసులు ఎప్పుడూ అడ్డుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం.. పోలీసులు అన్ని చోట్లా అడ్డుకుని సుప్రీంకోర్టును అడ్డం పెట్టుకుంటున్నారు . సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారమే అడ్డుకుంటున్నాం కానీ… ప్రభుత్వం చెప్పినందు వల్ల కాదంటున్నారు. మొత్తంగా లోకేష్ పాదయాత్ర విషయంలో .. వైసీపీలో ఓ రకమైన అలజడి కనిపిస్తోంది.. వారి తీరుతోనే స్పష్టమవుతోందన్న అభిప్రాయం బలపడుతోంది.