మంత్రిగా నారా లోకేష్ తన మార్క్ ను చూపుతున్నారు. ప్రజా దర్బార్ లో భాగంగా తన వద్దకు వస్తోన్న సమస్యలకు ఇట్టే పరిష్కారం చూపుతున్నారు. విశాఖకు చెందిన ఓ మహిళా సమస్యను ఓ రోజు కూడా తిరగకుండానే లోకేష్ పరిష్కరించారని ఆమె భావోద్వేగానికి గురైంది.
విశాఖకు చెందిన దేవకీదేవి బుధవారం లోకేష్ ను ప్రజా దర్బార్ లో భాగంగా కలిసింది. ఎగ్జిబిషన్ గడువు రెన్యువల్ కోసం కొన్ని రోజులుగా ఉన్నాతాధికారుల చుట్టూ తిరిగింది. తాము తయారు చేసిన చేతివృత్తుల ఉత్పత్తుల అమ్మకం కోసం అధికారులను గడువు కోరినా ఎలాంటి ఫలితం దక్కలేదు. దీంతో విసిగిన ఆ మహిళా లోకేష్ ప్రజా దర్బార్ గురించి తెలుసుకొని ఆయనను బుధవారం కలిసింది.
ఆమె సమస్యను ఓపికగా విని వినతిపత్రాన్ని స్వీకరించిన లోకేష్ తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చి పంపించేశారు. కానీ, గంటలలోనే తన సమస్య తీరిందంటూ దేవకీదేవి భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమైంది. ఇన్ని రోజులు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎలాంటి ఫలితం దక్కలేదని, కానీ లోకేష్ మాత్రం ఓ గంటల్లోనే సమస్యను పరిష్కరించారని తెలిపింది.
తమ పాలిట లోకేష్ దేవుడిలా మారి తమ సమస్యను గంటల్లోనే పరిష్కరించాడని దేవకీదేవి భావోద్వేగానికి గురైంది.