నారా లోకేష్ ప్రతి విషయంలోనూ అకౌంటబులిటీ చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. పాదయాత్ర సమయంలో ఆయన ఇచ్చిన హామీలను వరుసగా నెరవేర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతి వంద కిలోమీటర్లకు శిలాఫలకం వేసిమరీ లోకేష్ హామీలు ఇచ్చారు. ఇలా కుప్పం నుంచి బంగారుపాళ్యానికి పాదయాత్ర చేరుకున్న తర్వాత అక్కడి రోగుల కోసం డయాలసిస్ సెంటర్ పెట్టిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే… పనులు ప్రారంభించారు. ఇప్పుడు ప్రారంభానికి రెడీ అయింది.
అలాగే మాజీ సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు రూ. మూడు కోట్ల ప్రత్యేక నిధితో .. మాజీ సైనికుల సంక్షేమబోర్డును ఏర్పాటు చేస్తూ.. కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. నారా లోకేష్.. శిలాఫలకం వేసిన ప్రతి హామీని వచ్చే ఏడాదిలో పూర్తి చేసే సంకల్పంతో ఉన్నారు. ఇందు కోసం ఫాలో అప్ చేసేందుకు ఆయన ప్రత్యేక బృందాన్ని కూడా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. జగన్ రెడ్డి ఇచ్చినట్లుగా కనిపించిన ప్రతి ఒక్కరికీ అన్నీ చేసేస్తానని హమీ ఇవ్వలేనని.. చేసేవి మాత్రమే ఇస్తానని మొదటి నుంచి చెబుతున్నారు. ఆ ప్రకారం చేసి చూపించేందుకు సిద్ధమయ్యారు.
లోకేష్ మాట ఇస్తే.. మాటే అని నిరూపిస్తున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు హామీలు ఇస్తూంటారు. కానీ నారా లోకేష్.. అది చేయాలి అనుకుంటే… అప్పటికి ఖచ్చితంగా చేస్తానని చెబుతారు. చూద్దాం.. చేద్దామన్న హామీలు ఇవ్వరు. అలా చేస్తానని అన్న తర్వాత చేసి చూపిస్తారు. తాను ఇచ్చిన ప్రతి హామీ విషయంలో అకౌంటబులిటీ చూపించడాన్ని నారా లోకేష్.. ప్రజలకు జవాబుదారీగా ఉండటంగా భావిస్తున్నారు.