తెలుగు మీడియంను రద్దు చేస్తూ.. ఒక్క ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉంచాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే వారందరికీ రాజకీయ దురుద్దేశాలేనని జగన్ తేల్చేశారు…. మీ పిల్లలు ఏ స్కూళ్లలో చదవుతున్నారంటూ… స్ట్రాంగ్‌గా కౌంటర్ కూడా ఇచ్చాననిపించారు. కానీ.. కొద్ది రోజలు కిందట.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు… విద్యాశాఖ మంత్రిగా నారాయణ ఉప్పుడు… నగర పరిధిలో పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశ పెట్టాలనుకున్నప్పుడు.. అదీ కూడా.. ఇష్టమైన .. ఎంచుకున్న విద్యార్థులకు మాత్రమే.. ఆ సౌకర్యం కల్పించాలనుకున్నప్పుడు.. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు. ఆయన పార్టీ వ్యతిరేకించింది. ఆయన మీడియా కూడా వ్యతిరేకించింది. తెలుగు భాషను చంపేస్తున్నారని గగ్గోలు పెట్టింది.
యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ లాంటి వాళ్లతో పాటు.. ఎవరైనా.. తెలుగును చంపేస్తున్నారంటూ… విమర్శలు చేస్తూ ప్రకటనలు చేసినా.. మీడియాలో హైలెట్ చేసేది. ఇదే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి… ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకించినప్పుడు.. ఆయన పిల్లలు తెలుగు మీడియంలో చదువుతున్నారా.. అన్న ప్రశ్నలు సూటిగానే వేస్తున్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్.. ఈ విషయంలో.. మరింత సూటిగా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. గతంలో తెలుగు పరిరక్షణ కోసం యుద్ధం చేశారు గుర్తులేదా.. అని ప్రశ్నించారు. ‘ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగే ముద్దు’ అని ఉద్యమం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ ఉద్యమం చేస్తున్న రోజున మీ అమ్మాయిలు తెలుగు మీడియంలో చదివారా? అని అడిగేశారు.
సాక్షి పత్రిక అప్పట్లో ప్రచురించిన…’ఎందుకింత తెగులు?’, ‘తెలుగు లెస్సేనా?’ “మాతృభాషకు మంగళం” వంటి ఆర్టికల్స్‌ను తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం అదే అయి ఉంటే.. ఆ రోజున.. టీడీపీ నిర్ణయాన్ని వ్యతిరేకించి.. ఇప్పుడు పదవులు కట్టబెట్టిన పెద్దలందరితో.. విమర్శింపచేసేవారు కాదన్న అభిప్రాయం ఉంది. ఆనాడు రాజకీయ దురుద్దేశంతోనే… చంద్రబాబు నిర్ణయంపై ఆరోపణలు చేయించారని.. ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నారని సులువుగానే అర్థం చేసుకోవచ్చంటున్నారు.