తెలుగు రాష్ట్రాలకు చెందిన నెటిజన్లకు బాగా పరిచయం ఉన్న గాసిప్ వెబ్సైట్ అది. గతంలో కొందరు రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలపై ఆధారాలు లేని అవాస్తవ కథనాలు ప్రచురించిందని ఆయా రాజకీయ నాయకులు ఆ వెబ్ సైట్ పై కేసులు కూడా పెట్టారు. ఒక పార్టీకి వత్తాసు పలుకుతూ, మిగతా పార్టీల పై విషం కక్కుతూ, ప్రతి వార్తను కూడా తాము మోసే రాజకీయ పార్టీ కి అనుగుణంగా ప్రజెంట్ చేస్తూ వస్తున్న ఆ వెబ్ సైట్ కి లోకేష్ ఊహించని విధంగా ఝలక్ ఇచ్చారు. ఆ వెబ్ సైట్ పై లోకేష్ నేరుగా విమర్శనాస్త్రాలు సంధించిన విధానాన్ని ఎంతో మంది నెటిజన్లు అభినందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
ఆ వెబ్సైట్ ఇటీవల ప్రచురించిన ఒక కథనం ప్రకారం, తెలుగుదేశం పార్టీ సాహో సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోందట. దానికి కారణం ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో జగన్ పాలన బాగుంది అని కితాబు ఇవ్వడం అట. పైగా కృష్ణంరాజు కూడా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారట, అందుకే తెలుగుదేశం పార్టీ ఆ సినిమా మీద కత్తి గట్టిందట. ఇది ఆ వార్త. అయితే చదివిన వారికెవరికైనా ఇది ఆ వెబ్సైట్ వండి వార్చిన కథనం అని అర్థం అవుతుంది. దీనిపై ఎవరూ స్పందించరని, వారలా స్పందించకపోతే ఇదే నిజమైతే పోతుందని భావించిన ఆ వెబ్సైట్ కి ఝలక్ ఇచ్చాడు లోకేష్. నేరుగా ఆ వెబ్సైట్ పేరు ప్రస్తావిస్తూ, వారి ఆర్టికల్ లింక్ ఇస్తూ, ఇటువంటి తప్పుడు కథనాలు రాసి సంపాదించిన డబ్బులతో తింటే అన్నం కడుపు కి అంటదు అన్న అర్థం వచ్చేలా గట్టిగా పంచ్ ఇచ్చాడు లోకేష్. సాహో సినిమా కోసం తాను కూడా ఎదురు చూస్తున్నాం అని వ్యాఖ్యానించాడు లోకేష్. సాధారణంగా లోకేష్ ఇచ్చే వ్యాఖ్యలను విమర్శించే నెటిజన్లు సైతం ఆ గాసిప్ వెబ్‌సైట్‌కు బాగా గడ్డి పెట్టారంటూ లోకేష్ ను అభినందించారు.
మొత్తానికి తలాతోకాలేని కథనాలు రాస్తే, ఎవరి మీద పడితే వారి మీద తనకు తోచినట్లు బురద చల్లితే, మునుపటి లాగా చూసి చూడనట్టు వదిలి వేయరని ఆ వెబ్ సైటుకు ఇప్పుడైనా అర్థం అయి ఉండాలి.
How low and ugly can you get Great Andhra? Shame on the pseudo journalist who wrote these blatant lies!! How are you even able to eat with the money earned from caste divisions and spreading hatred?? Don’t you have any conscience? https://t.co/xNAsFEeaSO
— Lokesh Nara (@naralokesh) August 19, 2019