ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ఉన్న అక్రమాస్తుల కేసుల దృష్ట్యా, ప్రతి శుక్రవారం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవుతున్నారు. పాదయాత్ర సమయంలో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరినా ధర్మాసనం ఒప్పుకోకపోవడంతో పాదయాత్ర సమయంలో సైతం శుక్రవారం యాత్రకు బ్రేక్ ఇచ్చి కోర్టుకు హాజరయ్యారు. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ మరొకసారి కోర్టుకు విజ్ఞాపన పెట్టుకున్నారు జగన్.తాను కోర్టుకు హాజరవడాని కి ప్రజాధనం ఖర్చు అవుతుంది కాబట్టి ఆ కారణం చేత తనకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇచ్చి తన లాయర్ మాత్రం హాజరయ్యేలా అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టుకు జగన్ విజ్ఞప్తి పెట్టుకున్నారు.
అయితే ఇదే అంశం మీద సెటైర్లు విసిరారు మాజీ మంత్రి నారా లోకేష్. జగన్ పరిపాలన నుండి తుగ్లక్ పరిపాలన తో పోలుస్తూ, శుక్రవారం శుక్రవారం కోర్టు నుండి హాజరు కాకుండా ఉండడానికి ఈ విధంగా చేస్తే సరిపోతుంది అంటూ సెటైర్లు విసిరారు. లోకేష్ ట్వీట్ చేస్తూ, ” తుగ్లక్ 2.0 సమస్యకి పరిష్కారం జగన్ గారూ ! రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, హైదరాబాద్ రావడం ఖర్చుతో కూడుకున్నది అని కోర్టుకి కహానీలు ఎందుకు చెప్పడం, దోచుకున్న లక్ష కోట్లు రాష్ట్ర ఖజానాకి అప్పగిస్తే సరిపోలా !! రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, ఖజానా నిండుతుంది. అంతే కాకుండా, మీరు ప్రతి శుక్రవారం హైదరాబాద్ వెళ్లి రావడానికి అయ్యే భద్రత, రవాణా ఖర్చులకి, ప్రభుత్వానికి నిధులు కూడా సమకూరుతాయి. ఇంత సులువైన పరిష్కారం ఉండగా మినహాయింపు ఎందుకు మాస్టారు. శిక్ష ఎలాగో తప్పదుగా ! ” అని రాసుకొచ్చాడు.
ఈ సెటైర్ లపై వైఎస్ఆర్సిపి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.