మాటలు చెప్పినట్లుగా చేతల్లో చూపించడం చిన్న విషయం కాదు. ఆ విషయంలో నారా లోకేష్ పర్ ఫెక్షన్ సాధిస్తున్నారు. ఏదో హామీ ఇచ్చినట్లుగా కాకుండా అది పరిష్కారమయ్యే వరకూ ఫాలో అప్ చేస్తున్నారు. మూడు రోజుల కిందట గల్ఫ్ లో ఏజెంట్ మోసానికి బలైపోయి.. ఏడారి దేశంలో బానిస బతుకు ఈడుస్తున్న శివ అనే వ్యక్తి వీడియో వైరల్ అయింది. వెంటనే… నారా లోకేష్ స్పందించాడు. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ కష్టాల నుంచి తప్పించి స్వరాష్ట్రానికి రప్పిస్తానని హామీ ఇచ్చారు.
ఇవాళ శివ కువైట్‌లోని ఇండియన్ ఎంబసీకి చేరుకున్నాడు. శివ గురించి ఎన్నారై టీడీపీని లోకేష్ అప్రమత్తం చేశారు. వెంటనే అతని గురించి వాకబు చేసి.. అతన్ని వెట్టి నుంచి బయటపడేయడానికి అససరమైన న్యాయపరమైన చర్యలు తీసుకున్నారు. సేఫ్ గా అతన్ని కువైట్ ఎంబసీకి చేర్చారు. మిగతా కార్యక్రమాలను పూర్తి చేసి అతన్ని రేపోమాపో స్వరాష్ట్రానికి పంపనున్నారు.
ఏదో పని ఇప్పిస్తామని చెప్పి.. గల్ఫ్ కు తీసుకెళ్లే ఏజెంట్లు వారిని దుర్భరమైన పరిస్థితుల్లో వదిలేసి వస్తున్నారు. అతి తక్కువ జీతంతో ఒంటెలు కాసే పనుల్ని ఇప్పిస్తున్నారు. దీంతో వారు కుంగి కృశించి పోతున్నారు. వారి కుటుంబాలు ఇబ్బంది పడుతూంటాయి. అలాంటి సమయంలో వారికి సాయంచేసే వారు ఉండరు. శివ విషయం వైరల్ అయింది కాబట్టి నారా లోకష్ స్పందించి కాపాడారు. ఇంకా ఎంతో మంది అలాంటి అభాగ్యులు ఉంటారు. వారి కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలని నారా లోకేష్‌కు.. విజ్ఞప్తి చేస్తున్నారు.