శాసనమండలిని రద్దు చేసిన ఏపీ సర్కార్… ఇక శాసనమండలి లేదని… నిర్ణయానికి వచ్చేసినట్లుగా ఉంది. ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేష్ భద్రతను పూర్తిగా కుదించేశారు. నక్సల్స్ ముప్పు ఉన్న నారా చంద్రబాబునాయుడు కుమారుడిగా.. ఆయనకు మొదటి నుంచి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. కానీ ఇప్పుడు.. ఆయనకు వన్ ప్లస్ వన్ సెక్యూరిటీని మత్రమే… ప్రభుత్వం మిగిల్చింది. అంటే… పూటకు ఒక్క గన్ మెన్ మాత్రమే..లోకేష్ భద్రతను చూసుకుంటారన్నమాట.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి… చంద్రబాబు కుటుంబసభ్యులకు భద్రత తగ్గించడం ప్రారంభమైంది. చివరికి చంద్రబాబు సెక్యూరిటీని కూడా తగ్గించడంతో.. ఆయన కోర్టులో పిటిషన్ వేయాల్సి వచ్చింది. చివరికి నిబంధనల ప్రకారం.. సెక్యూరిటీని కల్పిస్తున్నామని ప్రభుత్వం చప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు కుటుంబసభ్యులకు సెక్యూరిటీ తగ్గిస్తూ వస్తోంది. మొదట లోకేష్‌కు… జడ్ ప్లస్ ఉండేది. తర్వాత ఎక్స్.. తర్వాత వై కేటగిరీలకు మార్చారు. ఇప్పుడు అది వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ అయింది.
తన పర్యటనల్లో భద్రతా లోపాలు బయట పడుతున్నాయని… సెక్యూరిటీ లోపాలు సవరించాలని.. ఇప్పటి వరకూ… లోకేష్ ఎనిమిది సార్లు పోలీసులకు లేఖలు రాశారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. పైగా ఉన్న సెక్యూరిటీకి కోత విధిస్తున్నారు. సెక్యూరిటీని తగ్గిస్తే.. లోకేష్ పర్యటనలు తగ్గిస్తారన్న కారణంగానే.. ప్రభుత్వం ఇలా చేస్తోందని.. టీడీపీ నేతలు అంటున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. భయపడేది లేదంటున్నారు.