నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అవినీతిని బయట పెడుతున్నారు. ముందు ఆరోపణలు చేసి.. వారు నిరూపించాలని సవాల్ చేసిన తర్వాత అసలు ఆధారాలు బయట పెడుతున్నారు. దీంతో చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎదురుదాడి కూడా చేయలేకపోయారు. అయితే అనూహ్యంగా ఒంగోలుకు వచ్చిన నారా లోకేష్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఎలాంటి విమర్శలు చేయలేదు.
నిజానికి బాలినేనిపై విమర్శించాలంటే చాలా ఉన్నాయి. నోట్ల కట్టతరలింపు .. క్యాసినో.. కాంట్రాక్టులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కానీ లోకేష్ ఒక్క విమర్శ కూడా చేయలేదు. దీంతో టీడీపీలో కాకుండా వైసీపీలో కలకలం బయలుదేరింది. అసలేం జరిగిందా అని అందరూ ఆరా తీయడం ప్రారంభించారు. చివరికి జగన్ రెడ్డి కూడా బాలినేనిని పిలిచారు. ఏం జరుగుతోందని ఆరా తీశారు. లోకేష్ విమర్శించకపోవడంతో తనకేం సంబంధమని తనను ఎందుకు అనుమానిస్తున్నారని.. అవమానిస్తున్నారని బాలినేని ఫీలవుతున్నారు.
బాలినేని వచ్చే ఎన్నికల నాటికి టీడీపీలో చేరి ఒంగోలు ఎంపీగా పోటీ కి ఫిక్సయ్యారన్న ప్రచారం జరుగుతోంది . ఇప్పటికే చర్చలన్నీ పూర్తయ్యాయని.. అందుకే పార్టీ వ్యవహారాలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. దీని గురించి తెలియడంతోనే… విజయసాయిరెడ్డి ఒంగోలు వెళ్లి బాలినేనితో చర్చలు జరిపారంటున్నారు. బాలినేని టీడీపీలో చేరుతారో లేదో కానీ.. లోకేష్ మాత్రం విమర్శించకుండానే… వైసీపీలో పెద్ద చిచ్చు పెట్టేశాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.