ముఖ్యమంత్రి జగన్ .. అవినీతిని అంతం చేయడానికి ప్రత్యేకమైన చట్టం చేస్తామని ప్రకటించడాన్ని టీడీపీ కామెడీ చేస్తోంది. నారా లోకేష్.. ఈ విషయంలో జగన్‌కు ప్రత్యేకంగా ఓసలహా ఇచ్చారు. అవినీతిని అంతం చేయడానికి 6093 నెంబర్ కాల్ సెంటర్ పెడితే..సింబాలిక్‌గా ఉంటుందని సలహా ఇచ్చారు. ఈ 6093 నెంబర్ ఏమిటంటే.. అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్టయినప్పుడు ఆయనకు చెంచల్ గూడ జైలులో కేటాయించిన నెంబర్.
” అవినీతి చక్రవర్తి, క్విడ్‌ప్రోకో కింగ్, ప్రజలసొమ్ము 43 వేల కోట్లు కొట్టేసి సీబీఐ..ఈడీ కేసుల్లో ఏ1గా ఉంటూ చంచల్‌గూడలో 16 నెలలు జైలులో ఉన్నందుకు గుర్తుగా మీకిచ్చిన నెంబర్ 6093, ఇదే నెంబర్ అవినీతిపై ఫిర్యాదు చెయ్యడానికి టోల్‌ఫ్రీకి పెడితే సింబాలిక్‌గా ఉండేదన్నారు. మీరు దోచేసిన ప్రజా సొమ్ము ప్రభుత్వ ఖజానాకి జమచేసి, అప్పుడు అవినీతిపై మాట్లాడితే బాగుంటుంది జగన్‌రెడ్డి గారు అని సలహా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి నిరోధంగా… సోమవారం సమీక్ష చేసి ఏసీబీ అధికారులకు అనేక సూచనలు చేశారు. ఏ స్థాయిలోనూ అవినీతి ఉండకూడదని…దిశానిర్దేశం చేశారు. ఇందు కోసం కాల్ సెంటర్ కీలకంగా పని చేయాలని నిర్దేశించారు.
అయితే..జగన్ సీఎం అయిన తర్వాత ఏపీలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇసుక దగ్గర్నుంచి మద్యం వరకు… సంక్షేమ పథకాల్లో లబ్దిదారుల ఎంపిక దగ్గర్నుంచి ఇళ్ల స్థలాల పేరుతో.. వసూళ్ల వరకూ…పేదలను..దోపిడీ చేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం..తమ ప్రభుత్వం వచ్చాక అవినీతిని కట్టడి చేశామని..రివర్స్ టెండర్ల గురించి…గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను తిరగదోడటం గురించి చెప్పుకుంటోంది.
.@ysjagan గారూ అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నెంబర్ 14400 పెట్టారు. అవినీతి చక్రవర్తి, క్విడ్‌ప్రోకో కింగ్, ప్రజలసొమ్ము 43 వేల కోట్లు కొట్టేసి సీబీఐ..ఈడీ కేసుల్లో ఏ1గా ఉంటూ చంచల్‌గూడలో 16 నెలల్లో జైలులో ఉన్నందుకు గుర్తుగా మీకిచ్చిన నెంబర్ 6093.(1/2) pic.twitter.com/KU6PyC7lPT
— Lokesh Nara (@naralokesh) August 25, 2020