మైనార్టీ వర్గాలు వైసీపీ ఓటు బ్యాంక్. అయితే గత నాలుగేళ్ల కాలంలో వారిపై జరిగినన్ని అరాచకాలు లెక్కలేనన్ని ఉన్నాయి. కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి. మరికొన్ని కుటుంబాలు అదే ప్రయత్నం చేశాయి. ఇక వారి వక్ఫ్ ఆస్తులన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి. వైసీపీలో అధికారం అనుభవిస్తున్న కొంత మంది నోరు మెదపడం లేదు. దీంతో వారి బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. నారా లోకేష్ ఆదివారం మైనార్టీలతో “గుఫ్తాగు” కార్యక్రమాన్ని నిర్వహించారు. ” గుఫ్తాగు” అంటే ఉర్దూలో సంభాషణ అని అర్థం.
కడపలో పది రూపాయల డాక్టర్‌గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ పర్వీన్, మైనార్టీ హక్కుల సంరక్షణ కోసం పోరాడుతున్న షుబ్లీల ఆధ్వర్యంలో నిర్వహించిన “గుఫ్తాగు” కు పెద్ద ఎత్తున మైనార్టీలు తరలి వచ్చారు. ముఖ్యంగా ఎంతో మంది ప్రభుత్వ బాధితులు వచ్చారు. న్యాయం చేయమని కోరారు. మనుషులతో అయితే యుద్దం చేయవచ్చు కానీ.. ప్రస్తుతం రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని… వారి దోచినది తిరిగి ఇచ్చే రకం కాదని.. ప్రభుత్వం మారగానే దోపిడకి గురైన సొత్తును.. వైసీపీ నేతల చెర నుంచి విడిపించి ఇరవై నాలుగు గంటల్లో ఇచ్చేస్తామని భరోసా ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబసభ్యుల దగ్గర నుంచి తిరుపాల్ రెడ్డి అనే సీఎం బంధువు కబ్జాకు గురైన మైనార్టీ కుటుంబం వరకూ కొన్ని వందల మంది వచ్చి లోకేష్‌కు సమస్యలు చెప్పుకున్నారు.
ఈ కార్యక్రమంలో ముస్లింలకు టీడీపీపై ఉన్న సందేహాలను కూడా తీర్చారు. బీజేపీతో పొత్తు విషయంలో ముస్లిం నేతలు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సూటిగా సుత్తి లేకుండా సమాధానం ఇచ్చారు. బీజేపీతో గతంలో ఎప్పుడు కలిసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలిశామని.. ఎప్పుడైనా ముస్లింలకు ఇబ్బందికరపరిస్థితి ఎదురయిందా అని ప్రశ్నించారు. జనహితం టీడీపి అభి’మతం’ హిజాబ్ ని సమర్థిస్తున్నామని లోకేష్ స్పష్టం చేశారు. ఇలా ముస్లింల సమస్యలపై స్పష్టమైన అవగాహనతో లోకేష్ ఇచ్చిన సమాధానాలు మైనార్టీలను సంతృప్తి పరిచాయి… టీడీపీ వస్తే తమ బాధలు తగ్గుతాయన్న నమ్మకం వారిలో కనిపించింది. ఈ సందర్భంగా తమ భవిష్యత్తు నాయకునికి ఆప్యాయతగా రవ్వ లడ్డు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.