ఆకస్మిక తనిఖీలు అంటే చంద్రబాబు గుర్తుకు వస్తారు. మొదటి సారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆకస్మిక తనిఖీలు చేసేవారు. సమాచారం లీక్ అయ్యేది కాదు. ఆయన బ యటకు వస్తున్నారంటే రాష్ట్రం మొత్తం అలర్ట్ అయ్యేది. అలాంటి ఆకస్మిక తనిఖీలు తరవాత తగ్గిపోయాయి. ఇప్పుడు నారా లోకేష్ అలాంటి తనికీలు ప్రారంభించారు.
సాక్షిపై వేసిన పరువు నష్టం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి మంత్రి నారా లోకేష్ విశాఖ వెళ్లారు. శనివారం కూడా విశాఖలోనే ఉన్నారు. ఆ సమయాన్ని ఆకస్మిక తనిఖీలకు ఉపయోగించుకున్నారు. ద్వారకా నగర్లో ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయానికి వెళ్లారు. నార్మల్గా అయితే ఉదయం ఎనిమిది గంటలకు తెరవాల్సిన గ్రంథాలయం మూసి ఉంది. కాసేపు అక్కడే నిలబడిపోయారు. విషయం తెలియడంతో హడావుడిగా అధికారులు గ్రంథాలయాన్ని ఓపెన్ చేశారు.
తర్వాత నెహ్రూ బజార్ మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి. అంగన్వాడీ బాలల కేంద్రాన్ని సందర్శించి అక్కడి సిబ్బందితో మాట్లాడారు. పిల్లలతో కొద్దిసేపు సరదాగా గడిపారు. చిన్నారులకు చాక్లెట్లు పంచి వారితో కలిసి ఫోటోలు దిగారు. చిన్నారులకు అందిస్తున్న గుడ్లు, పౌష్టికాహారం సరఫరాపై సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నారు. లోపాలు కనిపించినా నారా లోకేష్ ఎవరిపైనా ఆగ్రహం వ్యక్తం చేయలేదు. కానీ..హఠాత్తుగా ఎవరైనా తనిఖీలకు రావొచ్చన్న ఓ భయాన్ని మాత్రం క్లపించరు. దీన్ని అలా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.