టీడీపీ నేత నారా లోకేష్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తనకు లక్షణాలేమీ లేవని… ఎలాంటి అనారోగ్యం లేదని హోంఐసోలేషన్లో ఉన్నానని లోకేష్ ప్రకటించారు. తనను కలిసి న వారందరూ టెస్టులు చేయించుకోవాలన్నారు. గత వారం రోజులుగా లోకేష్ పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. ఒకటి…రెండు ట్వీట్లు మాత్రం చేశారు.
ఈ ఉదయమే స్కూళ్లకు సెలవులు ఇవ్వాలి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాస్తూ ట్వీట్ చేశారు. కాసేపటికే తనకు కరోనా సోకిందని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసుతో పాటు ఇతర చోట్ల కరోనా నిబంధనలను పక్కాగా పాటిస్తూంటారు. తొలి రెండు వేవ్‌లలో అందుకే టీడీపీ ఆఫీసు సిబ్బంది కూడా పెద్దగా కరోనా బారిన పడలేదు . కానీ ధర్డ్ వేవ్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పుడు లోకేష్‌కు కూడా సోకింది.
కరోనా ధర్డ్ వేవ్ ప్రమాదకరంగా విస్తరిస్తోంది. అయితే ఎక్కువ మందికి అతి స్వల్ప లక్షణాలు.. లేదా లక్షణాలు లేని పరిస్థితి కనిపిస్తోంది. ఆస్పత్రి పాలయ్యేవారి సంఖ్య .. మెదటి, సెకండ్వేర్తో పోలిస్తే తక్కువే. అయినప్పటికీ ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాయి.
I have tested positive for COVID-19.
I’m asymptomatic and feeling fine but will be self-isolating until recovery.
I request those who have come in contact with me to get tested at the earliest and take necessary precautions.
Urging everyone to stay safe. ?
— Lokesh Nara (@naralokesh) January 17, 2022