” ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రొగ్రెసివ్ హ్యాండ్స్ చేతుల్లో ఉంది. అద్భుతమైన విజన్.. కార్యచరణకు స్పష్టమైన ప్రణాళిక.. అంతకు మించి రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలన్న చిత్తశుద్ధి ఉన్న నేతల చేతుల్లో ఉంది” అని మంత్రి నారా లోకేష్ ను ఇంటర్యూ చేసిన జాతీయ మీడియా ముక్తకంఠంతో ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. నారా లోకేష్‌తో ఇంటర్యూలు చేసేందుకు ప్రముఖ చానళ్లు ముందుకు వచ్చాయి. టైమ్స్ నౌ ఎడిటర్ నావికా కుమార్ లోకేష్‌ను ఇంటర్యూ చేశారు. ఈ ఇంటర్యూలో నారా లోకేష్ చెప్పిన సమాధానాలకు ఎంతో మందిని ఇంటర్యూ చేసిన రికార్డు ఉన్న నావికా కుమార్ కూడా ఫిదా అయ్యారు.
ఓన్లీ పాజిటివ్ వైబ్స్
నారా లోకేష్ యంగ్ లీడర్. ఇటీవలి కాలంలో దేశంలో యువనేతల్లోనూ నెగెటివ్ వైబ్సే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రజలు తమకు ఎందుకు అవకాశం ఇచ్చారో చూసుకోకుండా అవినీతి, కక్ష సాధింపులతో వ్యవహరిస్తూ వస్తున్నారు. కానీ భారత యువ నాయకత్వంలో నారా లోకేష్‌ది ప్రత్యేక శైలి. పూర్తిగా పాజిటివ్ వైబ్స్ తో ఆయన ఇంటర్యూ సాగింది. ఏపీ కోసం తన విజన్ ఏమిటి.. తాను దాన్ని ఎలా సాధించాలనుకుంటున్నారు లాంటివన్నీ ఏ మాత్రం తోట్రుపడకుండా టైమ్స్ నౌ చానల్ ద్వారా దేశం ముందు ఉంచారు నారా లోకేష్.
జాబ్ క్రియేటర్‌గా గుర్తింపు రావాలన్న టార్గెట్
యువత కోసం.. వారికి ఉద్యోగాల కోసం నారా లోకేష్ చేస్తున్నప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తన ప్రయత్నాలను.. తన గోల్ ను నావికా కుమార్ ముందు వెల్లడించారు లోకేష్. ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని .. స్పష్టంచేశారు. ప్రజలు, ఆంధ్రప్రదేశ్ తనను ఓ జాబ్ క్రియేటర్ గా గుర్తుంచుకోవాలన్నది తన లక్ష్యమని తెలిపారు. ఈ మేరకు వంద రోజుల్లోనే తాము సాధించిన ప్రగతిని నారా లోకేష్ వివరించారు. 100 రోజుల్లో టీసీఎస్, లూలు వచ్చాయి. రెన్యువల్ ఎనర్జీ, పెట్రో కెమికల్స్, ఫార్మా కంపెనీలతో చర్చలు కొలిక్కి వచ్చాయని గుర్తు చేశారు.
టెస్లాతోనూ సంప్రదింపులు
ఇండియాలో ప్లాంట్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నటెస్లా చీఫ్ ఎలాన్ మస్క్‌తో ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని నారా లోకేష్ ఈ ఇంటర్యూలో ప్రకటించారు. టెస్లా ప్లాంట్ తీసుకురావాలని 2015 నుంచి చంద్రబాబు ప్రయత్నాలు మేము కొనసాగిస్తున్నామని తెిపారు. దేశంలోనే పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీని ముందు నిలపడమే మా లక్ష్యమని అందు కోసం బిగ్ టార్గెట్ ను పెట్టుకున్నామని లోకేష్ చెబుతున్నారు. ఏదైనా ఓ హామీ ఇస్తే వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
నారా లోకేష్ ను ఇంటర్యూ చేయడానికి జాతీయ చానళ్లకు చెందిన ఎడిటర్లు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే.. ఎలాంటి తోట్రుపాటు లేకుండా ప్రతిప్రశ్నకు సూటిగా సమాధానం ఇస్తారు. ఓ మంచి సంభాషణలా ఇంటర్యూ సాగిపోతుంది. ఏపీ భవిష్యత్ కోసం ఓ యువనేత పడే తపన ఎలా ఉంటుందో టైమ్స్ నౌ ఇంటర్యూలో ప్రజల ముందు ఆవిష్కృతమయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.