నారా లోకేష్ తన తల్లి భువనేశ్వరితో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఏపీలో ఉన్న ఎమర్జెన్సీ తరహా వాతావరణంపై జాతీయ మీడియాకు ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో జాతీయ స్థాయిలో .. స్పందన వచ్చింది. చంద్రబాబును రాజకీయకక్షోనే అరెస్టు చేశారని అనేక పార్టీల నేతలు ప్రకటించారు. జాతీయ మీడియా కూడా ఈ ఘటనపై విస్తృతంగా కవరేజీ ఇస్తోంది. దీంతో చంద్రబాబు మొత్తం ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
మరో వైపు ఏపీలో న్యాయవ్యవస్థ విషయాన్ని కూడా చర్చకు పెట్టాలని ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఓ మాజీ ముఖ్యమంత్రిని గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేసిన .. ఎఫ్ఐర్ లేకపోయినా నిర్దిష్టమైన ఆరోపణలు.. సాక్ష్యాలు లేకపోయినా అరెస్ట్ చేశారు. అయినా ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబుకు రిమాండ్ విధించడం.. సీఐడీ పోలీసులు కోర్టులో చెప్పకుండా బయట ఇష్టారీతిన మీడియా సమావేశాలు పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తూండటాన్ని బయట పెట్టే అవకాశం ఉంది. న్యాయనిపుణులను కూడా కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఢిల్లీలో లోకేష్ కొన్ని రాజకీయ పరమైన సమావేశాలు కూడా నిర్వహిస్తారని అంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ అంశంపై స్పష్టత లేదు. కానీ ఏపీలో పరిస్థితుల్ని ఢిల్లీలో అందరి ముందు పెట్టాలని నారా లోకేష్ గట్టిగా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. లోకేష్ ఢిల్లీ పర్యటనపై వైసీపీలోనూ ఆసక్తి ఏర్పడింది. శుక్రవారం తాము ఏదో చేస్తామని ప్రచారం చేసుకున్నారు కానీ.. లోకేష్ ఢిల్లీలో ఏదో చేయడానికి వెళ్తున్నారని టెన్షన్ పడుతున్నారు.