కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయాన్ని అవకాశంగా తీసుకున్న లోకేష్ చేసిన ఒక్క ట్వీట్ సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీని కదిలించింది. ఏపీకి వెల్కం చెబుతూ నాస్కాంకు రిప్లయ్ ఇచ్చిన లోకేష్ ట్వీట్ ఎఫెక్ట్ మూడు రోజుల్లోనే కనిపించింది. నాస్కామ్ టీం అమరావతికి వచ్చి లోకేష్‌తో సమావేశమయింది. ఏపీలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, ఐటీ పాలసీ, మ్యాన్ పవర్ స్కిల్స్ పెంచడం వంటి అంశాలపై నాస్కామ్ బృందంతో లోకేష్ చర్చించారు. సంయుక్త భాగస్వామ్యంతో సృజనాత్మకమైన, ప్రభావవంతమైన వర్క్ ఫోర్స్ ను పెంచేలా ఏపీలో టెక్ ఎకో సిస్టమ్‌ను డెలవప్ చేయాలని భావిస్తున్నారు.
Read Also : నాస్కామ్కు నారా లోకేష్ వెల్కం !
విశాఖను టెక్ హబ్ గా మార్చేందుకు నారా లోకష్ పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు. గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అనేక ప్రతిపాదనలు వచ్చాయి. అవన్నీ గత ఐదేళ్లలో పక్కకుపోయాయి. ఇప్పుడు ఆ ప్రతిపాదనలన్నింటినీ తెరపైకి తెచ్చి అందర్నీ సంప్రదిస్తున్నారు. దేశంలో సాఫ్ట్ వేర్ కంపెనీల అసోసియేషన్ అయిన నాస్కామ్.. వర్క్ ఫోర్స్ కు బె స్ట్ ప్లేసెస్ ఎక్కడ ఉంటాయో అంచనా వేసి.. ఎక్కడ మంచి ప్రభుత్వ పాలసీలు ఉన్నాయో ఆయా కంపెనీలకు సూచనలు చేస్తుంది.
లోకేష్ పట్టుదల .. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో విశాఖకు వచ్చే రెండు, మూడేళ్లలో ప్రముఖ మల్టినేషనల్ కంపెనీలన్నీ తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఐదేళ్లుగా ఆగిపోయిన ఐటీ అభివృద్ధి మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉంది.