కొంత మంది ప్రాణాలు తీస్తారు.. కొంత మంది జీవితాల్ని నిలబెడతారు. రెండు పనులు చేసేది మనుషులే. కానీ అ మనుషుల్లో మనుషులు.. రాక్షసులు అని వేరు చేసేది ఆ పనులే. అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్‌ను కలిసిన ఓ కుటుంబం గురించి తెలుసుకుంటే.. రాజకీయాల్లో అసలు మనుషులు ఎవరు ? రాక్షసులు ఎవరు అన్నది అర్థం చేసుకోవచ్చు.
పాదయాత్రలో ఉన్న నారా లోకేష్‌ను ఓ కుటుంబం కలిసింది. వారిది అనంతపురం జిల్లా. ఆ కుటుంబంలో పిల్లలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదువుకున్నారు. వారి చదువులు.. ఇతర అవసరాలు మొత్తం ఎన్టీఆర్ ట్రస్టే చూసుకుంది. ఆ కుటుంబం నుంచి మొత్తం ఆరుగుర్ని చదివిస్తే నలుగురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు అయ్యారు. వారిలో ఇద్దరు వర్క్ ఫ్రం హోం చేస్తూ స్వగ్రామంలో ఉంటున్నారు. వారు నారాలోకేష్ పాదయాత్రకు వస్తున్నారని ప్రత్యేకంగా వెళ్లి కలిశారు. లోకేష్ వారిని అభినందించారు. వారి కుటుంబానికి రాజకీయ రాక్షసులు అన్యాయం చేసినా.. పట్టుదలకు కుటుంబాన్ని.. జీవితాల్ని తీర్చిదిద్దుకున్నందుకు అభినందించారు.
ఇంతకీ ఆ కుటుంబం ఎవరిదంటే్.. తగరకుంట ప్రభాకర్ ది. రాజకీయాలపై ఆసక్తి ఉన్న .. ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు తగరకుంట ప్రభాకర్. పరిటాల రవి ప్రధాన అనుచరుల్లో ఒకరు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత పరిటాల రవి లక్ష్యంగా హత్యలు వరుసగా జరిగాయి. పరిటాల రవి అనుచరులందర్నీ వరుసగా చంపుతూ వచ్చారు. అలా హత్యకు గురైన వారిలో ఒకరు తగరకుంట ప్రభాకర్. ఆత్యంత దారుణంగా ఆయనను వైఎస్ వర్గీయులు హత్య చేశారు. ఆయనను చంపేసిన కొన్నాళ్లకే పరిటాల రవి కూడా చంపేశారు. తగరకుంట ప్రభాకర్ హత్యతో ఆయన కుటుంబం అనాథగా మారింది. ఆ కుటుంబంలో ఆరుగురు పిల్లలు ఉన్నారు.
ఆ కుటుంబం గురించి తెలుసుకున్న టీడీపీ అధినేత .. ఆరుగురు పిల్లలకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదువు చెప్పించారు. చదువు అయిపోయి ఉద్యోగాలు తెచ్చుకునేవరకూ ఎన్టీఆర్ ట్రస్ట్ వారికి అండగా ఉంది. వీరు ఒక్కరే కాదు.. ఇలా రాజకీయ కక్షలతో ఎంతో మంది టీడీపీ నేతల్ని 2004 తర్వాత చంపేశారు. అలాంటి కుటుంబాలన్నింటికీ ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా నిలబడింది. కొంత మంది సివిల్స్‌లో కూడా విజయం సాధించారు.