చిన్న పాత్రనైనా, పేరున్న నటుడితో చేయించాలి..
– ఇదీ పెద్ద సినిమాలు నమ్ముకుంటున్న సూత్రం. వెండి తెర నిండుగా కనిపించాలంటే – ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు ముఖ్యం. చాలామంది దర్శకులు ఇదే ఫాలో అవుతున్నారు. సుకుమార్ కూడా అంతే. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో `పుష్ష` రూపుదిద్దుకుంటోంది. ఇందులో స్టార్ బలానికి ఢోకా లేదు. ఓ కీలక పాత్ర కోసం నారా రోహిత్ ని సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. అది నిజమే.
పుష్షలోని ఓ కీలక పాత్ర కోసం రోహిత్ ని సంప్రందించింది చిత్రబృందం. `ఈ పాత్రకు రోహిత్ అయితే బాగుంటాడు` అని బన్నీనే సలహా ఇచ్చాడట. దాంతో.. రోహిత్ తో టచ్ లోకి వెళ్లింది సుకుమార్ టీమ్. రోహిత్ కూడా కొన్నాళ్లుగా కొత్త కథలపై దృష్టి పెట్టాడు. బరువు తగ్గాడు. ఓ మంచి కథతో రీ ఎంట్రీ ఇవ్వాలని ఫిక్సయ్యాడు. అలాంటి దశలో .. పుష్ఫ ఆఫర్ బోనసే. కాకపోతే.. రోహిత్ కి ఇప్పుడు కావాల్సింది.. హీరోగా ఓ బ్రేక్. క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్ర చేస్తే, రోహిత్ ఇక ఆ పాత్రలకే పరిమితమేమే అని సినీ జనాలు అనుకునే ప్రమాదం ఉంది. హీరోగా మంచి హిట్లు ఇస్తూ, అడపాదడపా ఇలాంటి పాత్రలు చేసినా – మైలేజీ బాగుంటుంది. పుష్ఫ హిట్టయితే ఈ పేరు బన్నీకో, సుకుమార్కో వెళ్తుంది. తెర నిండా ఎంతమంది నటులున్నా.. వాళ్లకు క్రెడిట్ దక్కదు. మహా అయితే రోహిత్ కూడా బాగా చేశాడ్రా అనే పేరొస్తుంది అంతే. ఈ దశలో రోహిత్ కి కావాల్సింది ఇలాంటి పాత్రలు కాదు. తన ఖాతాలో ఓ హిట్ సినిమా పడాలి. పైగా.. ఈమధ్య రోహిత్ తన బరువుపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు. బాగా తగ్డాడు. అక్టోబరు నుంచి కొత్త సినిమా మొదలెట్టాలని చూస్తున్నాడు. సరిగ్గా అక్టోబరు నుంచే పుష్ష టీమ్ డేట్లు అడుగుతోందట. అందుకే రోహిత్ డైలామాలో పడిపోయాడు. పెద్ద క్రేజ్ ఉన్న సినిమాని చేయాలా? దాని కోసం హీరోగా తన సినిమాని పక్కన పెట్టాలా? అని ఆలోచిస్తున్నాడట. ప్రస్తుతానికైతే చర్చలు నడుస్తున్నాయి. రోహిత్ చేస్తాను అని గానీ, చేయను అని గానీ చెప్పలేదు. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.